
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీలో సంచలనం! మార్చి 19న గ్రాండ్ రిలీజ్!
- శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు
- గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది
- తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ షురూ!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా మార్చి 19న విడుదల కాబోతుంది. ఫ్యాన్స్ కి పండగ చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ముందే వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 రాబోతుందని ఇటీవల ప్రకటించారు. ఎప్పట్నుంచో సాగుతున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని చెప్పిన డేట్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా ఫ్యాన్స్ కి మరింత హ్యాపీనెస్ ఇస్తూ సినిమాని ముందే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది పండగ రోజు రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది.
పవన్, హరీష్ కాంబో మళ్ళీ వచ్చేసింది
ఆ రోజు పాన్ ఇండియా సినిమా దురంధర్ కూడా రిలీజ్ ఉంది. అయితే ఉస్తాద్ మాత్రం కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. దీంతో ఉగాది పండక్కి ఫ్యాన్స్ థియేటర్స్ లో రచ్చ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడంలో బిజీగా ఉన్నాడు.
తమన్ మ్యూజిక్ తో థియేటర్స్ దద్దరిల్లుతాయి
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ – పవన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండగే. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


