|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్: ఫిబ్రవరి 22న ఊర్రూతలూగించే అప్డేట్!

Published: 16-02-2026, 12:35 AM
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తెరకెక్కుతోంది.
  • ఫిబ్రవరి 22న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో పవర్ఫుల్ ఆంథమ్ విడుదల కానుంది.
  • దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
  • పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో రాశిఖన్నా, అశుతోష్ రానా నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ విడుదల ఎప్పుడు?

Ustaad Bhagat Singh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు హీరోగా అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ .. మరొకవైపు గత ఏడాది ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తన ఖాతాలో ఒక విజయాన్ని వేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేసి తన నటనతో అందరినీ మాయ చేసారు. అలాంటి ఈయన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆరా ఆఫ్ ఉస్తాద్.. సెకండ్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ అభిమానులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు రెండవ పాట కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అధికారిక ప్రకటన చేస్తూ అంచనాలు పెంచింది చిత్రబృందం.. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. పవన్ కళ్యాణ్ ప్రజలలో చైతన్యం నింపుతున్నట్టు వెనుక నుండి ఒక ఫోటోని షేర్ చేస్తూ..” ఆరా ఆఫ్ ఉస్తాద్” పేరుతో ఒక పవర్ఫుల్ ఆంథమ్ ను ఫిబ్రవరి 22న విడుదల చేయబోతున్నాం అంటూ ట్వీట్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఈ ఏడాది మార్చి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మొత్తానికి అయితే రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి అభిమానులలో అంచనాలు పెంచేశారు చిత్ర బృందం.

తెలుగు భాష యాక్షన్ కామెడీ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపు దిద్దుతున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్, శ్రీ లీలా జంటగా రాశిఖన్నా, అశుతోష్ రానా, నవాబ్ , బి ఎస్ అవినాష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో4చూడాలి

దేవిశ్రీప్రసాద్ సంగీతంలో పవర్ఫుల్ ఆంథమ్!

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి పవన్ కళ్యాణ్ కి కథ చెప్పే పనిలో ఉన్నారట. మరొకవైపు ఈ సినిమా కోసం హీరోయిన్గా ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న ఇమాన్వి(Imanvi ) పేరును చిత్ర బృందం పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The man we love ❤️ The man we celebrate 💥

మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల!

POWERSTAR’S AURA IN A POWERFUL ANTHEM 🔥🔥🔥 #UstaadBhagatSingh second single #AuraOfUstaad out on February 22nd ❤‍🔥 #UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026. #UBSOnMarch26th

POWER STAR @PawanKalyan … pic.twitter.com/MIDq8pG3sz

— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 15, 2026

మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం సెకండ్ సింగిల్ అప్డేట్‌తో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.