|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

UV Creations : మా పేరుతో హీరోయిన్లకు నకిలీ ఆఫర్లు.. జాగ్రత్త : యూవీ క్రియేషన్స్ హెచ్చరిక

Published: 03-07-2025, 8:26 AM
UV Creations : మా పేరుతో హీరోయిన్లకు నకిలీ ఆఫర్లు.. జాగ్రత్త : యూవీ క్రియేషన్స్ హెచ్చరిక

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ పేరుతో హీరోయిన్లకు నకిలీ సినిమా ఆఫర్లు అందుతున్నాయని హెచ్చరించింది. ఒక వ్యక్తి తమ సంస్థ తరపున నటిస్తూ ఫ్రాడ్ ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.

Key Points

1

UV Creations పేరుతో నకిలీ సినిమా ఆఫర్లు హీరోయిన్లకు వస్తున్నాయి.

2

ఒక వ్యక్తి UV Creations తరపున నటీనటులను సంప్రదిస్తున్నాడు.

4

UV Creations చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.

యూవీ క్రియేషన్స్ హెచ్చరిక

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), అతని మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ గురించి తెలిసిందే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. కాగా తాజాగా ఓ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది. ఓ వ్యక్తి తమ కంపెనీ ప్రతినిధిని అని చెప్పుకొని పలువురు హీరో హీరోయిన్ల మేనేజర్లను కలిసి ఫ్రాడ్ ఆఫర్స్(Fraud Offers) ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తమ సంస్థకు సదరు వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము ఎలాంటి అధికారిక సమాచారం అయినా, నటీనటుల ఎంపిక అయినా అధికారిక ఛానెల్ ద్వారా నిర్వహిస్తామని, మధ్యవర్తి వ్యక్తులు ఎవరూ ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. తమ సంస్థ పేరును మిస్యూస్ చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపిన యూవీ క్రియేషన్స్.. వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించింది. దయచేసి దీనిని అందరూ గమనించాలని తన ప్రకటనలో కోరింది.

నకిలీ ఆఫర్ల గురించి వివరాలు

చట్టపరమైన చర్యలు

యూవీ క్రియేషన్స్ తమ పేరును దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని, నటీనటులు జాగ్రత్త వహించాలని కోరుతోంది. ఈ విషయం అందరికీ తెలియజేయడం చాలా ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.