‘మహావతార్ నరసింహా’ యానిమేషన్ సినిమా సత్తా చాటిన తర్వాత, ఇప్పుడు హనుమంతుని కథ ఆధారంగా ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా తెరకెక్కుతోంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Key Points
మహావతార్ నరసింహా విజయం తర్వాత వాయుపుత్ర తెలుగులో రాబోతోంది.
హనుమంతుని కథ ఆధారంగా తెరకెక్కుతున్న యానిమేషన్ సినిమా ఇది.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 దసరాకు విడుదల కానుంది.
చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అవుతుంది.
మహావతార్ నరసింహా విజయం
ఈ ఏడాది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసిన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా’. శ్రీ విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహా అవతారం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితో తెలుగులోనూ ఓ దేవుడి కథ యానిమేషన్ సినిమాగా రాబోతుంది.
పురాణాల్లో హనుమంతుడిని తలుచుకోగానే ఓ ధైర్యం, నమ్మకం, భక్తి, సాహసం లాంటివి గుర్తుకొస్తాయి. ఇప్పటికే ఆంజనేయుడి పాత్ర ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలుగులో హనుమంతుడి కథతో యానిమేషన్ ఫిల్మ్ రాబోతుంది. ‘వాయుపుత్ర’ టైటిల్ తో ఇది ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఇవాళ (సెప్టెంబర్ 10) సితారా ఎంటర్ టైన్మెంట్స్ పోస్టర్ షేర్ చేసింది.
వాయుపుత్ర ప్రాజెక్ట్ వివరాలు
‘‘మన చరిత్రలోని ఆత్మ నుంచి, మన ఇతిహాసాల్లోని పేజీల నుంచి మరణం లేని లెజెండ్ కథ వస్తుంది. వాయుపుత్ర- కేవలం సినిమా కాదు భక్తితో కూడిన అద్భుతం. ఇది చందూ మొండేటి ఫిల్మ్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ ఎపిక్ 3డీ యానిమేషన్ అనుభూతిని 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఆస్వాదించండి’’ అని సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
వాయుపుత్ర ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్బంగా పోస్టు చేసిన రెండు ఫొటోలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ఫొటోలొ కొండపై నిలబడి అగ్నికి ఆహుతి అవుతున్న లంకను చూస్తున్న పవర్ ఫుల్ హనుమంతుడి స్టిల్ ఉంది. మరో దాంట్లో టైటిల్ డిజైన్ ఉంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ యానిమేషన్ సినిమాను నిర్మిస్తున్నారు.
రిలీజ్ తేదీ మరియు భాషలు
మహావతార్ నరసింహా రికార్డు
హోంబలే ఫిల్మ్స్ రూపొందించిన మహావతార్ నరసింహా యానిమేషన్ మూవీ థియేటర్లలో సత్తాచాటింది. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు వాయుపుత్ర సినిమాను కూడా ఇలాగే ప్రజలందరికీ చేర్చాలనే లక్ష్యంతో నిర్మిస్తున్నారు.
మహావతార్ నరసింహా విజయం తర్వాత, వాయుపుత్ర సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని ఆశిద్దాం. 2026 దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.


