|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేద పాఠశాలలో దారుణం: పక్క మంచంపై పడుకున్నాడని విద్యార్థికి నరకం!

Published: 22-03-2026, 3:35 AM
వేద పాఠశాలలో దారుణం: పక్క మంచంపై పడుకున్నాడని విద్యార్థికి నరకం!
  • మధ్యప్రదేశ్‌లోని వేద పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు.
  • పక్క బెడ్‌పై పడుకున్నాడని విద్యార్థిని చితకబాదిన వార్డెన్ దత్తదాస్ షెవ్డే.
  • బెత్తంతో విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయుడిపై నెటిజన్ల ఆగ్రహం.
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద విద్యా సంస్థలో ఘటన.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ వేద పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి పొరపాటున పక్క బెడ్ మీద పడుకున్నాడని వార్డెన్ దారుణంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాధిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్‍ ఉజ్జయినిలోని (Ujjain) ప్రముఖ మహర్షి సందీపని వేదవిద్యా సంస్థలో (Maharshi Sandipani Rashtriya Veda Vidya Pratishthan) ఈ దారణం వెలుగు చూసింది. ఈ వేద పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థి పొరపాటున తన పక్కన ఉన్న మరో విద్యార్థి మంచం మీద పడుకున్నాడనే కారణంతో ఉపాధ్యాయ బాధ్యతలతో పాటు వార్డెగా పని చేస్తున్న దత్తదాస్ షెవ్డే ఓ విద్యార్థిని బెత్తంతో చితకబాదాడు. ఆ దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి విలవిలలాటిపోయినా ఉపాధ్యాయుడు మాత్రం ఏ మాత్రం కనికరం చూపకుండా విచక్షణారహింతో వాతలు తేలాలో కొట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు ఉపాధ్యాయుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుచేసిన వారిని నచ్చజెప్పి అలాంటి తప్పులు జరగుండా ఒప్పించాల్సింది పోయి ఇలా కిరాతకుడిగా వ్యవహరించడం ఏంటని మండిపుడుతున్నారు. వేద విద్యను అందిస్తున్న ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఇక్కడ వేదవిద్యను అభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

నెటిజన్ల ఆగ్రహం, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఈ ఘటన వేద విద్యా సంస్థల నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.