
టాలీవుడ్ నటి రితికా సింగ్ తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ నటించిన ‘గురు’ సినిమాతో పరిచయమైన రితికా, తన బరువు తగ్గింపు ప్రయాణాన్ని పంచుకుంటూ, ఆమె పొట్టతో కనిపించడం ప్రెగ్నెన్సీ అనుమానాలకు దారితీసింది.
Key Points
రితికా సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ వీడియో షేర్ చేసింది.
వీడియోలో ఆమె పొట్టతో కనిపించడంతో ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ అయ్యాయి.
ఆమె బరువు తగ్గించుకున్న విధానం గురించి వివరించింది.
కొందరు ప్రెగ్నెన్సీ గురించి, మరికొందరు ఆమె డెడికేషన్ గురించి స్పందిస్తున్నారు.
రితికా సింగ్ యొక్క షాకింగ్ వీడియో
యంగ్ హీరోయిన్ రితికా సింగ్(Ritika Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె వెంకటేష్ హీరోగా నటించిన ‘గురు’ (guru) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే మొదట తమిళంలో విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. దీంతో రితికా సింగ్ వరుస మూవీస్‌లో అవకాశం అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, భాషల్లో నటించిన ఆమె ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘వెట్టైయాన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, రితికా సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది.
గత మూడు నెలలు ఎప్పటికీ మర్చిపోలేను. నేను బరువు స్కేలుపై అత్యున్నత స్థాయికి చేరుకున్నాననే వాస్తవం మాత్రమే కాదు, నా మోకాలి గాయాలు తీవ్రమయ్యాయి. నొప్పి భయంకరంగా ఉంది. నేను కదలలేకపోయాను.. తన్నలేకపోయాను, నృత్యం చేయలేకపోయాను పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అప్పుడే నేను అద్దంలో నన్ను నేను చూసుకుని, మీరు ఇప్పటివరకు కనిపించినంత అందంగా కనిపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాను. ఇది చాలా పొడవైన అంశం ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారంతో నా సంబంధం నేను చివరకు నా చెడు అలవాట్లను ఎలా నియంత్రించుకున్నాను. నేను కొన్ని పెద్ద జీవనశైలి మార్పులు చేసాను.
ప్రెగ్నెన్సీ వార్తలపై చర్చ
కానీ నాకు అంతిమ గేమ్ ఛేంజర్ చిన్న విషయాలపై దృష్టి పెట్టడం. ముఖ్యంగా చాలా తక్కువగా అనిపించే విషయాలు కానీ అవే అతిపెద్ద ప్రభావాన్ని చూపాయి! మనలో చాలా మంది కనిపించడానికి ముఖ్యంగా మంచిగా ఉండటానికి ఇది సహాయపడుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. అయితే ఇందులో ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లుగా పొట్టతో కనిపించి షాకిచ్చింది. దీంతో అది చూసిన వారంతా ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నావా? అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె డెడికేషన్‌తో బరువు తగ్గడం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
బరువు తగ్గింపు అనుభవం
A post shared by Ritika Singh (@ritika_offl)
రితికా సింగ్ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రెగ్నెన్సీపై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం గురించి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


