|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వెంకటేష్ రెమ్యునరేషన్ డబుల్! ఒక్క సినిమాకి అన్ని కోట్లా? టాలీవుడ్ లో హాట్ టాపిక్!

Published: 01-02-2026, 4:35 AM
షాకింగ్: వెంకటేష్ రెమ్యునరేషన్ డబుల్! ఒక్క సినిమాకి అన్ని కోట్లా? టాలీవుడ్ లో హాట్ టాపిక్!
  • వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయం, రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో గెస్ట్ రోల్ లో వెంకటేష్, సినిమా రూ. 350 కోట్లు కొల్లగొట్టింది.
  • ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న విక్టరీ వెంకటేష్!
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో వెంకటేష్, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది!

విక్టరీ వెంకటేష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. దీంతో ఆయన తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్స్ వెనుక అసలు కథ!

Venkatesh: విక్టరీ వెంకటేష్ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకటేష్(Venkatesh). ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఆయన గెస్ట్ గా చేసిన రీసెంట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు.

ఈఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా రూ.350 కోట్ల వసూళ్లు సాధించి రీజనల్ సినిమాల్లో టాలీవుడ్ ఇండస్ర్టీ హిట్ గా నిలిచింది. అలా హీరోగానే కాదు గెస్ట్ గా చేసిన సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు వెంకటేష్. అందుకే, నెక్స్ట్ సినిమా కోసం తన రెమ్యునేషన్ ను భారీగా పెంచేశాడట వెంకటేష్.

రెమ్యునరేషన్ డబుల్ చేసిన వెంకీ మామ!

సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట వెంకటేష్. కానీ, ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం మాత్రం తన రెమ్యునరేషన్ ని డబుల్ చేశాడట. ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ వెంకటేష్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది కుర్ర హీరోలు హిట్స్ లేకుండా వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.

త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా.. వివరాలు!

అలాంటిది వెంకటేష్ లాంటి హీరో రూ.20 కోట్లు తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. పైగా ఆయన సినిమాలు ఫ్యామిలీ అంతా చూసేలా నీట్ గా ఉంటాయి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

వెంకటేష్ రెమ్యునరేషన్ పెంపు టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. ఆయన రాబోయే సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.