|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వెంకటేష్ దెబ్బకి కృష్ణ సినిమాలు మటాష్! బాక్సాఫీస్ షేక్.. రికార్డ్స్ బ్రేక్!

Published: 10-02-2026, 7:05 AM
షాకింగ్: వెంకటేష్ దెబ్బకి కృష్ణ సినిమాలు మటాష్! బాక్సాఫీస్ షేక్.. రికార్డ్స్ బ్రేక్!
  • వెంకటేష్ ‘సంక్రాంతి’ మూవీతో కృష్ణ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా!
  • ఫిబ్రవరి 10న విడుదలైన ‘ఎవరు నేను’ చిత్రం ‘సంక్రాంతి’ దెబ్బకి థియేటర్ల నుండి తొలగింపు!
  • కృష్ణ, హరికృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రావణమాసం’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘సంక్రాంతి’ చిత్రం వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్!

టాలీవుడ్ లో సంచలనం! వెంకటేష్ ‘సంక్రాంతి’ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎలా షాక్ ఇచ్చిందో తెలుసా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!

కృష్ణకి షాక్ ఇచ్చిన వెంకీ సక్సెస్

సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. స్టార్‌ హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో పోటీ ఊహించినదే, కానీ ఎలాంటి అకేషన్‌ లేకుండా వచ్చినప్పుడు నెలకొనే పోటీ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. 2005లో వాలెంటైన్స్ డే సమయంలో ఇంట్రెస్టింగ్‌ పోటీ నడిచింది. వెంకటేష్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ మధ్య రసవత్తరమైన పోటీనడిచింది. కృష్ణ రెండు సినిమాలను కోలుకోలేని దెబ్బకొట్టాడు వెంకటేష్‌. `సంక్రాంతి` మూవీతో ఆయన హిట్‌ అందుకున్నారు.

వెంకటేష్‌ ఫ్యామిలీ చిత్రాలకు, లవ్‌ స్టోరీస్‌కి కేరాఫ్‌. ఆయన ఫ్యామిలీ కథతో `సంక్రాంతి` అనే చిత్రం చేశారు. ఈ మూవీ సంక్రాంతికి కాకుండా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా 2005 ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. వెంకటేష్‌, శ్రీకాంత్‌, శివ బాలాజీ, శర్వానంద్‌, స్నేహా, ఆర్తి అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఎలాంటి సీజన్‌ లేకుండా వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యింది. వెంకటేష్‌, శ్రీకాంత్‌ల `సంక్రాంతి` మూవీ దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన చిత్రాలేంటనేది చూస్తే,

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. వెంకీ `సంక్రాంతికి` వారం ముందే వచ్చారు. `ఎవరు నేను` అనే చిత్రంలో నటించారు. దీనికి ముందులూరి భీమేశ్వరరావు దర్శకత్వం వహించారు. కృష్ణ సరసన రాధిక, రమ్యశ్రీ వంటి వారు నటించారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలైంది. దారుణమైన పరాజయం చెందింది. ప్రారంభంలో ఎంతో కొంత ఆడినా, `సంక్రాంతి` సినిమా దెబ్బకి థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వచ్చింది.

‘సంక్రాంతి’ మూవీతో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన వెంకటేష్

ఇక వెంకటేష్‌ `సంక్రాంతి` విడుదలైన వారం తర్వాత ఫిబ్రవరి 26న సూపర్‌ స్టార్‌ కృష్ణ, హరికృష్ణ నటించిన `శ్రావణమాసం` విడుదలయ్యింది. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళీ దర్శకత్వం వహించగా, ఇందులో కృష్ణ, హరికృష్ణతోపాటు కార్తికేయ గౌడ్‌, గజాల, కళ్యాణి, విజయ నిర్మల, భాను ప్రియా, నాగబాబు, సుమన్‌ వంటి వారు నటించారు. భారీ తారాగణంతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. `సంక్రాంతి` మూవీ ఫ్యామిలీ స్టోరీనే, `శ్రావణమాసం` కూడా ఫ్యామిలీ స్టోరీనే, కానీ వెంకీ ముందు కృష్ణ, హరికృష్ణలు కూడా నిలవలేకపోయారు.

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన నితిన్‌ `ధైర్యం` కూడా నిలవలేకపోయింది. రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా, తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో రీమా సేన్‌ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలైంది. ప్రారంభంలో ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఆ తర్వాత `సంక్రాంతి` మూవీ దెబ్బకి చిత్తైపోయింది.

కృష్ణ సినిమాలు ఫ్లాప్.. వెంకీదే హవా!

అలాగే వాలెంటైన్స్ డే స్పెషల్‌గా సచిన్‌ హీరోగా నటించిన `ఒరేయ్‌ పండు` మూవీ విడుదలయ్యింది. ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందడం విశేషం. రొమాంటిక్‌ డ్రామాగా ఇది తెరకెక్కింది. సండలి సిన్హా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఇలా వెంకటేష్‌ దెబ్బకి రెండు కృష్ణ సినిమాలు, నితిన్‌ మూవీ, సచిన్‌ చిత్రం పరాజయం చెందాయని చెప్పొచ్చు.

అయితే `సంక్రాంతి` వచ్చిన వారం తర్వాత శ్రీకాంత్‌, స్నేహ జంటగా నటించిన `రాధా గోపాళం` మూవీ విడుదలయ్యింది. బాపు రూపొందించిన చిత్రమిది. రొమాంటిక్‌, ఫ్యామిలీ డ్రామాగా వచ్చి ఆకట్టుకుంది. `సంక్రాంతి` మూవీని తట్టుకొని నిలబడ్డ ఒకే ఒక్క చిత్రం ఇదే అని చెప్పొచ్చు. మిగిలిన చిత్రాలు ఆకట్టుకోలేకపోవడంతో అది ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యింది. పైగా ఆ సమయంలో శ్రీకాంత్‌ కూడా హీరోగా పీక్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్‌ ఉంది. అది ఈ మూవీకి కలిసి వచ్చింది.

వెంకటేష్ ‘సంక్రాంతి’ మూవీ టాలీవుడ్ లో ఒక సంచలనం. కృష్ణ గారి సినిమాలు వెనకబడిపోవడం నిజంగా షాకింగ్. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.