|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ.. బర్త్‌డే విషెస్ చెబుతూ మేకర్స్ పోస్ట్

Published: 21-10-2025, 10:14 PM
వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ.. బర్త్‌డే విషెస్ చెబుతూ మేకర్స్ పోస్ట్

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Key Points

1

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపిక.

2

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ ఈ ప్రకటన చేశారు.

4

యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వెంకటేశ్ 77వ సినిమాలో శ్రీనిధి శెట్టి

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మరో కన్నడ అందాన్ని ఫిమేల్ లీడ్ గా తీసుకున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టికి బర్త్ డే విషెస్ చెబుతూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాను ఈ మధ్యే అధికారికంగా అనౌన్స్ చేశారు. వెంకీ తన కెరీర్లో నటిస్తున్న 77వ సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న మూవీ. ఇందులో ఫిమేల్ లీడ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

బర్త్‌డే విషెస్‌తో అధికారిక ప్రకటన

వెంకీ సరసన శ్రీనిధి శెట్టి

ఇప్పుడు మేకర్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా దానిని కన్ఫమ్ చేసింది. “గార్జియస్, గ్రేషియస్ శ్రీనిధి శెట్టికి బర్త్ డే విషెస్.. హ్యాపీ బర్త్ డే శ్రీనిధి శెట్టి.. ప్రొడక్షన్ నం.8లో మిమ్మల్ని తీసుకోవడం ఎక్సైటింగా ఉంది..” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.

హారిక అండ్ హాసిని బ్యానర్లో భారీ చిత్రం

శ్రీనిధి శెట్టి వరుస తెలుగు సినిమాలు

ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్లో మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు యానిమల్ ఫేమ్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. అయితే వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషనే ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తోంది.

వెంకటేశ్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టిల కాంబినేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.