|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vidya Balan: ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారు…

Published: 10-07-2025, 3:41 AM
Vidya Balan: ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారు...

బాలీవుడ్ నటి విద్యా బాలన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. ‘చక్రం’ సినిమా ఆగిపోవడంతో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడి, ఆమె 9 ప్రాజెక్టులను కోల్పోయిందని తెలిపింది.

Key Points

1

విద్యా బాలన్ ‘ఐరన్ లెగ్’ అనే ముద్రతో ఇబ్బందులు ఎదుర్కొంది.

2

‘చక్రం’ సినిమా ఆగిపోవడంతో 9 ప్రాజెక్టులు కోల్పోయింది.

4

విశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధించింది.

కెరీర్ ప్రారంభంలో విద్యా బాలన్ ఇబ్బందులు

చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం . ఇప్పుడు స్టార్ ‌ హోదాలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించే ఈ స్థాయికి వచ్చారు . ముఖ్యంగా హీరోయిన్లకు కెరీర్ ‌ ప్రారంభంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి . ఫస్ట్ ‌ చాన్స్ ‌ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూసినవాళ్లు కూడా ఉన్నారు . వచ్చిన ఆ ఒక్క చాన్స్ ‌ ని సరిగ్గా వాడుకున్న వాళ్లే ఇప్పుడు స్టార్ ‌ హీరోయిన్లుగా మారారు . అలా అందరిలాకే కెరీర్ ‌ ప్రారంభంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది బాలీవుడ్ ‌ హీరోయిన్ ‌ విద్యా బాలన్(Vidya Balan) ‌. ఇప్పుడు పాన్ ‌ ఇండియా హీరోయిన్ ‌ గా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ ‌ నటిపై మొదట్లో ‘ ఐరెన్ ‌ లెగ్ ‌’ అనే ముద్ర వేసి రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారట . ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ‌ చానెల్ ‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విద్యా బాలనే చెప్పింది .

‘ఐరన్ లెగ్’ ముద్ర, 9 ప్రాజెక్టుల నష్టం

‘ కెరీర్ ‌ ప్రారంభంలో నాకు మోహన్ ‌ లాల్ ‌ తో కలిసి ‘ చక్రం ’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది . షూటింగ్ ‌ ప్రారంభం అయిన కొన్నాళ్లకు అనూహ్యంగా అది ఆగిపోయింది . దానికి కారణం నేనే అని ప్రచారం జరిగింది . నాపై ‘ ఐరెన్ ‌ లెగ్ ‌’ అనే ముద్ర వేసి ఘోరంగా విమర్శించారు . చక్రం సినిమా ఆగిపోయిందనే విషయం తెలియగానే రాత్రికి రాత్రే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు . అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కానే కాదు . ఆ మూవీ డైరెక్టర్ ‌, మోహన్ ‌ లాల్ ‌ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సగంలోనే ఆపేశారు .

విద్యా బాలన్ విజయగాథ

అది నా కెరీర్ ‌ పై చాలా ప్రభావం చూపింది . అయినా నేను ధైర్యం కోల్పోలేదు . విశ్వాసంతో ముందుకు సాగాను . నాపై నాకు ఉన్న నమ్మకే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడేలా చేసింది . విశ్వాసంతో ముందుకుసాగితే ఏదోఒకరోజు కచ్చితంగా మనది అవుతుంది ’ అని విద్యా చెప్పుకొచ్చింది . కాగా , 2005 లో పరిణిత మూవీతో బాలీవుడ్ ‌ ఎంట్రీ ఇచ్చిన విద్యా .. ‘ ది డర్టీ పిక్చర్‌’తో భారీ హిట్ ‌ ని తన ఖాతాలో వేసుకుంది . సిల్క్ ‌ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో విద్యా లీడ్‌ రోల్‌ చేసింది. ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్‌  సినిమాలు చేస్తూ.. బాలీవుడ్‌లోనే కాదు దేశమంతటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇటీవల భూల్‌ భూలయ్య 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది.

విద్యా బాలన్ కష్టాలను అధిగమించి విజయం సాధించిన విధానం ప్రేరణాదాయకం. ఆమె విశ్వాసం, ధైర్యం అందరికీ స్ఫూర్తినిస్తాయి. ఈ రోజు ఆమె స్థాయికి చేరుకోవడానికి ఆమె కృషి, అంకితభావం కారణం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.