
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడుతూ…
Key Points
విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఆయన గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశారని తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు.
ఈడీకి తన బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అందించారు.
ఈడీ విచారణలో విజయ్ దేవరకొండ వివరణ
సాక్షి, హైదరాబాద్: నేను కేవలం గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానని, బెట్టింగ్ యాప్స్ ( Betting Apps ) ప్రమోట్ చేయలేదు అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ). ఈ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన కాంట్రాక్ట్, తీసుకున్న డబ్బు.. సహా అన్ని వివరాలను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కి ఇచ్చానని తెలిపాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రమ్మంటూ విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఈడీ ఎదుట హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు హీరోను విచారించారు.
గేమింగ్ యాప్స్ ప్రమోషన్ వివరాలు
విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడాడు. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. కానీ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను. A23 అనేది గేమింగ్ యాప్. చాలా రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ లీగల్. వీటికి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఈ గేమింగ్ యాప్స్.. ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్స్‌కు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదు. నా బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఈడీకి ఇచ్చాను. అధికారుల విచారణకు సహకరించాను అని పేర్కొన్నాడు.
బెట్టింగ్ యాప్స్‌తో సంబంధం లేదని విజయ్ స్పష్టీకరణ
విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు పూర్తి సహకారం అందించి, తన నిర్దోషిత్వాన్ని తెలిపారు. గేమింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించిన అన్ని వివరాలను అధికారులకు అందించడం ద్వారా విచారణకు తన సహకారాన్ని చాటుకున్నారు.