|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay devarakonda: అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?

Published: 16-05-2025, 12:24 PM
Vijay devarakonda: అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?

బిజీ షెడ్యూల్‌తో ఉన్నప్పటికీ, తన కుటుంబాన్ని విస్మరించని రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన అమ్మ కోరికను తీర్చాడు. అమ్మ కోరిక మేరకు వారంతా కలిసి బయట డిన్నర్ చేశారు. ఈ సంతోషకరమైన క్షణాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Key Points

1

విజయ్ దేవరకొండ తన అమ్మ కోరికను తీర్చాడు.

2

వారంతా కలిసి బయట డిన్నర్ చేశారు.

4

విజయ్ తన కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు.

అమ్మ కోరిక ఏమిటి?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్‌డమ్‌ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్‌డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్‌లో డిన్నర్‌ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్‌ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

కుటుంబంతో సమయం గడపడం

సోషల్ మీడియాలో వైరల్

విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..’అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం.  అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా, విజయ్ తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. అమ్మ కోరికను తీర్చడం ద్వారా, ఆయన కుటుంబ బంధాల ప్రాముఖ్యతను చాటుకున్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.