
‘కింగ్డమ్’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన చిన్ననాటి జీవితం, స్వతంత్రత, సినిమా ప్రస్థానం గురించి పలు విషయాలు తెలియజేశాడు.
Key Points
5 ఏళ్ల వయసులోనే బోర్డింగ్ స్కూల్‌లో చేరాడు విజయ్ దేవరకొండ.
చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా జీవనం గడుపుతున్నట్లు తెలిపాడు.
గొడవల్లో కూడా తనను తాను కాపాడుకోవడం నేర్చుకున్నాడని పేర్కొన్నాడు.
తన సినిమా కెరీర్‌లో ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా విజయం సాధించాడు.
విజయ్ దేవరకొండ బాల్య జీవితం
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) మూవీతో పాటు ‘వీడీ-14’(VD-14) చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కింగ్డమ్ మూవీఈ నెల 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను బోర్డింగ్ స్కూల్‌లో వేశారు. అలా అయిదేళ్ల నుంచే నేను అమ్మ నాన్న లేకుండా బతకడం నేర్చుకున్నాను.
నేను ఫస్ట్ టైం గొడవ పడ్డప్పుడు అవతలి వ్యక్తి కంటే తక్కువ దెబ్బలతో వచ్చాను. నాకు సమస్యలు వచ్చినప్పుడు మా నాన్నను తీసుకెళ్లకుండా నేనే ఎదుర్కొన్నాను. నా కెరీర్‌లో కూడా నేను ఎలాంటి గైడెన్స్ లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా విజయ్ దేవరకొండ చిన్నప్పటి నుంచి పుట్టపర్తి శ్రీ సత్యసాయి స్కూల్‌లో అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకున్న సంగతి తెలిసిందే.
స్వతంత్రతపై ఆయన అభిప్రాయాలు
సినిమా కెరీర్‌లో అనుభవాలు
చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండటం నేర్చుకున్న విజయ్ దేవరకొండ, తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను, విజయాలను తన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆయన కథ ప్రేరణాదాయకంగా ఉంది.

