|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండ ‘రణబలి’ వీడియో లీక్! ఈసారి రికార్డ్స్ బద్దలే!!

Published: 01-04-2026, 2:35 PM
  • విజయ్ దేవరకొండ ‘రణబలి’ షూటింగ్ వీడియో లీక్.. నెట్టింట వైరల్!
  • సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ‘రణబలి’ విడుదల.. భారీ అంచనాలు!
  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం.. రౌడీ హీరో మాస్ లుక్ అదుర్స్!
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రణబలి’.. టీ సిరీస్ సమర్పణ!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబలి’ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. రౌడీ హీరో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

లీక్ అయిన షూటింగ్ వీడియో.. వైరల్ అవుతున్న డైలాగ్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబలి’. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విజయ్, రష్మిక ప్రేమ పెళ్లి చేసుకోగా.. వీరిద్దరు నటిస్తున్న రణబాలి (విజయ్), జయమ్మ (రష్మిక) పాత్రలపై క్యూరియాసిటీ నెలకొంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టేజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా షూటింగ్ వీడియో లీక్ అయింది. ‘రేమ్ ముండమోపినాకొడకా.. ఏడున్నావ్ రా.. మీ ఇళ్లల్లోకి వచ్చిన.. రా అవ్వా చంపుదువు కానీ’ అంటూ విజయ్ గుర్రంపై వస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఈసారి విజయ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు.. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. షూటింగ్ వీడియో లింక్

‘రణబలి’తో రౌడీ హీరో మరో హిట్ కొట్టేనా?

సెప్టెంబర్ 11న గ్రాండ్ రిలీజ్.. అంచనాలు భారీగా!

విజయ్ దేవరకొండ ‘రణబలి’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.