
📌 Key Points
- విజయ్ దేవరకొండ వదులుకున్న ‘పరాశక్తి’ మూవీ.. శివ కార్తికేయన్ కెరీర్లో భారీ డిజాస్టర్!
- సుధా కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకి నెగటివ్ రివ్యూలు, భారీ నష్టాలు!
- విజయ్ దేవరకొండ బిజీగా ఉండడం వల్లే శివ కార్తికేయన్‌కు అవకాశం వచ్చిందట!
- పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాలని సుధా కొంగర భావించిన ‘పరాశక్తి’ మూవీ!
టాలీవుడ్లో ఒక సంచలనం! విజయ్ దేవరకొండ కెరీర్‌ను కాపాడిన ఒక నిర్ణయం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని వెనుక ఉన్న కథేంటి? తెలుసుకోవాలంటే చదవండి!
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమా ఏది?
సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఒకటే నెగిటివ్ రిజల్ట్ తెచ్చుకుంది. అంటే తమిళ ఇండస్ట్రీకి పరాశక్తి కూడా బొక్క బోర్లా పడిందని అంటున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా చేయగా శ్రీ లీల హీరోయిన్ గా మెరిశారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ రావడంతో… సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
శివ కార్తికేయన్ కెరీర్లో భారీ డిజాస్టర్ ఇదేనా?
శివ కార్తికేయన్ హీరోగా చేసిన పరాశక్తి సినిమా కోసం దాదాపు 120 కోట్ల బడ్జెట్ అయిందట. అయితే థియేటర్ రన్ లో కేవలం 45 కోట్లు మాత్రమే వసూలు చేసిందట ఈ సినిమా. కానీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తీసుకువచ్చిందని సమాచారం. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి తేలిపోయింది. అమరన్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత శివ కార్తికేయన్ కెరీర్ లో పరాశక్తి రూపంలో భారీ డిజాస్టర్ నమోదు అయినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
సుధా కొంగర ప్లాప్ వెనుక అసలు కారణాలేంటి?
శివ కార్తికేయన్ కంటే ముందు ఈ పరాశక్తి సినిమా కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందట. అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండ.. కింగ్ డమ్ సినిమాతో బిజీగా ఉన్నారట. దీంతో ఆ సినిమాను చేయలేనని రిజెక్ట్ చేశారట విజయ్. దీంతో శివ కార్తికేయన్ కు ఆ అవకాశం వచ్చినట్లు టాక్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దర్శకులు సుధా కొంగర కూడా పేర్కొన్నట్లు సమాచారం. విజయ్ ఒప్పుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను చేయాలని అనుకున్నారట.
ఇలా విజయ్ దేవరకొండ ఒక భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్నారు. శివ కార్తికేయన్ కు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


