
రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విజయ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పినా కేసు నమోదు కావడం గమనార్హం.
Key Points
రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
గిరిజన సంఘాలు విజయ్ వ్యాఖ్యలను గిరిజనులను కించపరిచేవిగా ఆరోపించాయి.
విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, SC/ST అట్రాసిటీ కేసు నమోదు అయింది.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబడింది.
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు
Vijay Deverakonda : ఏప్రిల్ లో రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాగా అప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఘటనల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. అలా మాట్లాడుతూ కొన్ని వేల ఏళ్ళ క్రితం ట్రైబ్స్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు అని అన్నారు. అయితే దీనిపై అప్పుడే పలువురు గిరిజన సంఘాలు స్పందించి ట్రైబల్స్ ని ఉగ్రవాదులతో పోలుస్తారా అని విమర్శలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
విజయ్ దేవరకొండ ఈ వివాదంపై అప్పుడే స్పందిస్తూ తన సోషల్ మీడియాలో.. నేను చేసిన వాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. ఏ వర్గాన్నీ, ఏ తెగను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను. భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటే అని భావిస్తాను. నేను ఏ సమూహం పై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉండే క్షమించండి. నేను శాంతి, ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను. ట్రైబ్ అనే పదాన్ని నేను వేరే సెన్స్ లో ఉపయోగించాను. దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటూ క్లారిటీ ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పారు.
గిరిజన సంఘాల ఫిర్యాదు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
అయితే తాజాగా విజయ్ దేవరకొండ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గిరిజన సంఘాలు ఈ అంశంపై ఫిర్యాదు చేసాయి. రెట్రో ఈవెంట్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు విజయ దేవరకొండ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.
విజయ్ దేవరకొండ ఇప్పటికే క్షమాపణలు చెప్పినప్పటికీ, గిరిజన సంఘాల ఫిర్యాదుతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం వివాదానికి దారితీసింది. ఈ ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
