
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘VD-14’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ వైరల్ గా మారింది. రాయలసీమలో షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది.
Key Points
విజయ్ దేవరకొండ 'VD-14' చిత్రం రాయలసీమలో షూటింగ్ ప్రారంభం.
వచ్చే నెల ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం విజయ్ షూటింగ్ లో పాల్గొంటారు.
19వ శతాబ్ద నేపథ్యంలోని పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'VD-14'.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
‘VD-14’ చిత్ర షూటింగ్ ప్రారంభం
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తీరిక లేకుండా మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా యాడ్స్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ రౌడీ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే30న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో పాటు రాహుల్ సంకృత్యన్(Rahul Sankrityan) దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు.
‘VD-14’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్(Ravi Shankar) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘VD-14’ చిత్రానికి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాయలసీమలో జరగబోతున్నట్లు సమాచారం. వచ్చే నెల ఫస్ట్ షెడ్యూల్ జరగనుండగా.. ఇందులో విజయ్ దేవరకొండ పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న రౌడీ హీరో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రాయలసీమలో షూటింగ్
విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్
చివరగా, విజయ్ దేవరకొండ ‘VD-14’ చిత్రంపై అప్డేట్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. రాయలసీమలో షూటింగ్ ప్రారంభం కావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.


