|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ ఊర మాస్ విధ్వంసం! ‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్: కత్తి పట్టి, లుంగీ కట్టి రచ్చ!

Published: 22-12-2025, 12:04 PM
విజయ్ దేవరకొండ ఊర మాస్ విధ్వంసం! 'రౌడీ జనార్ధన' గ్లింప్స్: కత్తి పట్టి, లుంగీ కట్టి రచ్చ!
  • రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ విడుదల.
  • లుంగీ, కత్తితో ఊర మాస్ అవతారంలో విజయ్ దేవరకొండ కనిపించారు.
  • నెత్తురోడిన దేహంతో, గూస్‌బంప్స్ తెప్పించే డైలాగ్‌లతో గ్లింప్స్ ఆకట్టుకుంది.
  • కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దిల్ రాజు నిర్మాణంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్.

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఊర మాస్ లుక్‌లో, లుంగీ కట్టి కత్తితో యాక్షన్ సీన్లలో విజయ్ కనిపించడం అభిమానులను అలరిస్తోంది. గోస్ బంప్స్ తెప్పించే డైలాగులు, పవర్ఫుల్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

విజయ్ దేవరకొండ మాస్ లుక్ హైలైట్స్

విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రౌడీ జనార్ధన. రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ (డిసెంబర్ 22) విడుదల చేశారు మేకర్స్. ఇందులో నెత్తురోడిన దేహంతో, లుంగీ కట్టి, కత్తి పట్టిన విజయ్ ‘రౌడీ’ అవతారం నెట్టింట వైరల్ అవుతోంది.

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన మార్క్ ‘రౌడీ’ ఇమేజ్‌ను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ కొత్త సినిమా రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ సోమవారం (డిసెంబర్ 22) సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది.

గ్లింప్స్‌లో డైలాగ్స్, యాక్షన్

“బండెడు అన్నం తిని కుండెడు రక్తం తాగే రాచ్చసుడి గురించి ఎప్పుడైనా విన్నావా. నేను చూశాను. కొమ్ములతో ఆడి కథను ఆడే రాసుకున్నాడు. కన్నీళ్లను ఒంటికి నెత్తుటిలా పూసుకున్నాడు. సావు కళ్లముందుకు వచ్చి నిలబడితే.. గత్తేరేసి కలబడినోడు. కలబడ్డాడు.. నా లోపల..” అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

ఆ తర్వాత లుంగీ కట్టి, చేతిలో పెద్ద కత్తితో శత్రువులపై వేటు వేస్తూ వయోలెంట్ యాక్షన్‌తో విధ్వంసం సృష్టించాడు విజయ్ దేవరకొండ. “కళింగపట్నంలో ఇంటికొక XXXXకు నేను రౌడీని అని చెప్పుకుని తిరుగుతున్నాడు.. కానీ ఇంటిపేరునే ‘రౌడీ’గా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ మాసీగా ఉంటూ విజిల్స్ వేసేలా ఉంది.

సినిమా విశేషాలు: హీరోయిన్, నిర్మాత

ఇదిలా ఉంటే, రౌడీ జనార్ధన సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ డ్రామా రౌడీ జనార్ధన 2026 డిసెంబర్‌లో విడుదల కానుంది.

రాహుల్ సాంకృత్యన్ సినిమా షూటింగ్‌లో తన ‘న్యూ లుక్’ రివీల్ అవ్వకుండా చేత్తో ముఖాన్ని దాచుకుంటూనే తన సంతోషాన్ని పంచుకున్నారు విజయ్ దేవరకొండ. “ప్రపంచం కంటే ముందే నా రౌడీస్ ఈ గ్లింప్స్ చూడాలని నేను దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాను” అని విజయ్ పేర్కొన్నారు.

మొత్తంగా, ‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో మాస్ బ్లాక్‌బస్టర్‌కు నాంది పలికినట్లు కనిపిస్తోంది. దిల్ రాజు భారీ నిర్మాణంలో 2026లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియా సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.