
📌 Key Points
- సంక్రాంతికి విజయ్ ‘జన నాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలు విడుదల కానున్నాయి.
- ‘జన నాయకుడు’ ట్రైలర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ ఫ్యాన్స్ హంగామా చేశారు.
- పరాశక్తి సినిమా బ్యానర్లను చింపేసి, తొక్కేసిన విజయ్ అభిమానులు రచ్చ సృష్టించారు.
- శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చారు.
సంక్రాంతి సినిమాల రేసులో విజయ్, శివ కార్తికేయన్ అభిమానుల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ‘జన నాయకుడు’ ట్రైలర్ వేడుకల్లో విజయ్ ఫ్యాన్స్ ‘పరాశక్తి’ బ్యానర్లను ధ్వంసం చేశారు. ఈ ఓవరాక్షన్ కోలీవుడ్‌లో పెద్ద రచ్చకు దారితీసి, తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
విజయ్ ఫ్యాన్స్ ఓవరాక్షన్: బ్యానర్ల ధ్వంసం
సంక్రాంతి పండుగ వస్తోన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతికి దాదాపు అర డజన్ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ లిస్టులో విజయ్ చేసిన ‘జన నాయకుడు’ అలాగే శివ కార్తికేయన్ చేసిన పరాశక్తి సినిమాలు ఉన్నాయి. జనవరి 9వ తేదీన ‘జన నాయకుడు’ సినిమా రిలీజ్ కానుండగా, ఒక్కరోజు గ్యాప్ లోనే పరాశక్తి సినిమా రాబోతోంది. దీంతో తమిళ ఇండస్ట్రీలో విజయ్, శివ కార్తికేయన్ మూవీస్ మధ్య పోటీ నెలకొంది.
పరాశక్తి టీమ్, అభిమానుల ఆగ్రహం
అయితే ఇలాంటి నేపథ్యంలో విజయ్ దళపతి అభిమానులు కాస్త ఓవరాక్షన్ చేశారు. ‘జన నాయకుడు’ సినిమా ట్రైలర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి బ్యానర్లు చించేశారు. మరికొన్ని బ్యానర్లను కిందపడేసి తొక్కేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ హీరో బ్యానర్లు తొలగించడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సంక్రాంతి బరిలో పరాశక్తి సినిమా హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. క్లిక్
సంక్రాంతి రేసులో స్టార్ల వార్
విజయ్ ‘జన నాయకుడు’ కు కొత్త చిక్కులు.. రిలీజ్ కావడం కష్టమేనా!
సంక్రాంతి రేసులో విజయ్, శివ కార్తికేయన్ ఫ్యాన్స్ మధ్య వివాదం పతాక స్థాయికి చేరింది. పరాశక్తి బ్యానర్ల ధ్వంసం కోలీవుడ్‌లో రచ్చకు దారి తీసింది. ఈ ఉద్రిక్తత ఎప్పుడు సద్దుమణిగేనో చూడాలి.


