
📌 Key Points
- ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ పెళ్లి అంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్, వెడ్డింగ్ కార్డులు వైరల్!
- రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం!
- పెళ్లికి వచ్చే అతిథులు ఫోన్లు తీసుకురాకూడదనే కండీషన్, ఫోటోలు లీక్ కాకుండా జాగ్రత్తలు!
- బహుమతులు కూడా తీసుకురావొద్దని రష్మిక, విజయ్ విజ్ఞప్తి, ‘మీ రాకే మాకు గిఫ్ట్’ అని లేఖ!
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు సెన్సేషన్. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందనే టాక్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పెళ్లికి ఫోన్లు తీసుకురావొద్దని కండీషన్!
టాలీవుడ్ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు వారిద్దరూ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కానీ ఇప్పటికే వెడ్డింగు కార్డులు మాత్రమే పంచేస్తున్నారు. ఈ జంట పెళ్లి పత్రిక అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తమపెళ్లికి వచ్చే అతిధులకు ఈ జంట కొన్ని కఠినమైన షరతులు పెట్టినట్టు తెలుస్తోంది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఎక్కడ కనిపించినా మీడియా వారు పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ వారిద్దరూ ఆ ప్రశ్నలను కూడా దాటవేస్తున్నారు. తమ పెళ్లిని చాలా సీక్రెట్‌గా చేసుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకున్నారు. అందుకే కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారట.
గిఫ్టులు కూడా వద్దంటున్న రష్మిక, విజయ్!
రష్మిక, విజయ్ తమ పెళ్లికి వచ్చేవారు తమ పెళ్లి మండపంలోకి ఫోన్లు తీసుకురాకూడదనే కండిషన్ పెట్టారట. పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా ఉండేందుకే ఈ ‘నో ఫోన్ పాలసీ’ని పెట్టారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి హడావుడి ఉండకూడదనేది వీరి ప్లాన్.
పెళ్లికి, రిసెప్షన్‌కు వచ్చే అతిథులు ఎలాంటి బహుమతులు తీసుకురావొద్దని కూడా ఈ జంట ప్రత్యేకంగా చెప్పిందట. ‘మీ రాకే మాకు పెద్ద గిఫ్ట్’ అని చెబుతూ రష్మిక, విజయ్ చేతిరాతతో ఉన్న ఒక లేఖను బంధుమిత్రులకు ఇచ్చారట.
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?
ఫిబ్రవరి 26న జరిగే వీరి పెళ్లికి సినీ ప్రముఖులను ఎవరినీ పిలవడం లేదని తెలుస్తోంది. ‘నో సెలబ్రిటీస్ పాలసీ’ని ఫాలో అవుతున్నారట. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే తమ పెళ్లిని చేసుకోబోతున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి, అప్పుడు సెలబ్రిటీలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ నెల రోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నారట. షూటింగ్‌లు, ప్రమోషన్లకు దూరంగా ఉండనున్నారు. పెళ్లి కాగానే ఈ జంట విదేశాలకు వెళ్లనున్నారని, హనీమూన్ కు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.
రష్మిక, విజయ్ పెళ్లి టాలీవుడ్ లో ఒక పెద్ద వార్తగా మారింది. వారి అభిమానులు ఈ వేడుక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


