|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Virosh Wedding Photos: రికార్డ్ సృష్టించిన విజయ్ – రష్మిక వెడ్డింగ్ ఫొటోస్.. 12 గంటల్లోనే

Published: 27-02-2026, 12:35 AM
Virosh Wedding Photos: రికార్డ్ సృష్టించిన విజయ్ – రష్మిక వెడ్డింగ్ ఫొటోస్.. 12 గంటల్లోనే
  • విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్‌లో హిందూ, కొడవ సంప్రదాయాల ప్రకారం జరిగింది.
  • వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి.
  • విజయ్ పోస్ట్‌కు 12 గంటల్లో 12 మిలియన్ లైక్స్, రష్మిక పోస్ట్‌కు 14 మిలియన్ లైక్స్ వచ్చాయి.
  • మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్‌లో జరిగింది. వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే రికార్డులు సృష్టించాయి. ఈ జంట మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

ఉదయపూర్ ప్యాలెస్‌లో వైభవంగా వివాహం

Virosh Wedding Photos:విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)రష్మిక మందన్న (Rashmika mandanna) దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించి.. ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ ప్యాలెస్ సాక్షిగా మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26 గురువారం ఉదయం 10:10 గంటలకు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగగా.. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మత సాంప్రదాయం ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం జరిగింది. ఇకపోతే వివాహం పూర్తయిన సందర్భంగా అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మందన్న ఒకరిపై మరొకరు తమ అభిప్రాయాలను పంచుకుంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు అలా విడుదల చేశారో లేదో అప్పుడే రికార్డు సృష్టించాయి.

ఉదయపూర్ లో ఘనంగా వివాహం జరగగా.. ఆ పెళ్లి ఫోటోలను ఇన్స్టా లో షేర్ చేశారు. అయితే ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కూడా తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఈ ఫోటోలను షేర్ చేయగా.. విజయ్ పోస్ట్ కు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్ లైక్స్ రాగా.. రష్మిక పోస్టుకి 14 మిలియన్ లైక్స్ తో రికార్డు సృష్టించింది. విరోష్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొత్తానికైతే ఈ లైక్స్ వీరికి ఉన్న క్రేజ్ ను తెలియజేస్తోంది అని చెప్పవచ్చు. మొత్తానికైతే కేవలం 12 గంటల్లోనే 2.6 కోట్ల లైక్స్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ జంట.

సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిన ఫోటోలు

అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట.. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4వ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ , ఆంధ్ర కి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఈ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారట. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తో కలిసి పనిచేసిన డైరెక్టర్లు నిర్మాతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ వేడుక

ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరికీ ఆహ్వానం అందినా.. అటు హీరో నాని ఇటు నిఖిల్ సిద్ధార్థ లకు విజయ్ దేవరకొండ ఇన్విటేషన్ పంపించలేదని సమాచారం. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. మరి ఈ రిసెప్షన్ కి ఎవరెవరు వస్తారు అనే విషయం తెలియాలి అంటే మార్చి 4 వరకు ఎదురు చూడాల్సిందే.

Tags rashmika Manadanna Vijay Devarakonada Share

మొత్తానికి విరోష్‌ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించాయి. వారి రిసెప్షన్ వేడుక ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో ఆ వేడుక మరింత ప్రత్యేకంగా ఉండనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.