
📌 Key Points
- విజయ్, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్‌లో జరగనుందని సమాచారం.
- పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినా జంట తిరస్కరించింది.
- తమ పెళ్లి వేడుకను వ్యాపారంగా మార్చడానికి ఈ జంట ఇష్టపడటం లేదు.
- గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్, రష్మికల మధ్య ప్రేమ చిగురించింది.
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వగా వారు సున్నితంగా తిరస్కరించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్, రష్మికల పెళ్లి వార్తల్లో నిజమెంత?
Vijay Rashmika wedding: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వారిలో విజయ్ దేవరకొండ రష్మిక జంట కూడా ఒకటి. వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని సమాచారం. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ ప్యాలెస్ లో జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నా కూడా ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారక ప్రకటన మాత్రం తెలియచేయలేదు.
ఇలా రష్మిక విజయ్ పెళ్లి గురించి ఎలాంటి స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా వీరి పెళ్లికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వీడియో కోసం ఒక ప్రముఖ ఓటీటీ సమస్థ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడం కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వీరి పెళ్లి వీడియో కోసం పెద్ద ఎత్తున ఆఫర్ ఇచ్చినప్పటికీ ఈ జంట మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించారని సమాచారం. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ వేడుకను వ్యాపారం లాగా అమ్ముకోవడానికి ఈ జంట ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
కోట్ల రూపాయల ఆఫర్‌ను తిరస్కరించిన జంట
ఇకపోతే గతంలో నయనతార దంపతులు తన పెళ్లి స్ట్రీమింగ్ విషయంలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలు లేకుండా తమ పెళ్లి వేడుకను కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా, జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలని విజయ్ భావించినట్టు తెలుస్తుంది .అందుకే కోట్ల రూపాయల ఆఫర్ వదులుకున్నారని సమాచారం. ప్రస్తుతం వీరు పెళ్లికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్ రష్మిక నిర్ణయం పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక రష్మిక విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాలో మొదటిసారి వెండి తెరపై జంటగా నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ జంట మరోసారి డియర్ కామ్రేడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పరవాలేదనిపించుకుంది. ఈ సినిమాల సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ మరోసారి జంటగా వెండితరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రణబాలి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ప్రేమకు గుర్తుగా పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న జంట
విజయ్, రష్మికల పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ పెళ్లిని వ్యక్తిగతంగా ఉంచుకోవాలనే వారి నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


