|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి పీటలు! రెండు సాంప్రదాయాల్లో వివాహం! వైరల్ న్యూస్!

Published: 25-02-2026, 5:05 AM
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి పీటలు! రెండు సాంప్రదాయాల్లో వివాహం! వైరల్ న్యూస్!
  • విజయ్, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న రెండు సాంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా జరగనుంది!
  • తెలుగు సంప్రదాయంలో విజయ్ కోసం, కొడవ సంప్రదాయంలో రష్మిక కోసం ప్రత్యేక వివాహాలు!
  • కొడవ సంప్రదాయంలో మంగళసూత్రానికి బదులు భుజానికి బంగారు కాయిన్ కడతారు, పురోహితులు ఉండరు!
  • పెళ్లిలో పంది కూర, బియ్యపు రొట్టెలు, ప్రత్యేకమైన డ్యాన్స్, గన్ సెల్యూట్ సంబరాలు!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెండు సాంప్రదాయాల్లో పెళ్లి వేడుకలు!

Vijay Rashmika W edding : గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న విజయ్ – రష్మిక ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 26 వీరి పెళ్లి జరగనుంది. అయితే వీరి పెళ్లి రెండు సాంప్రదాయాల్లో జరగబోతుందని సమాచారం. విజయ్ కోసం తెలుగు సంప్రదాయంలో, రష్మిక కోసం కొడవ సంప్రదాయంలో జరగనుందని తెలుస్తుంది.

ఫిబ్రవరి 26న మొదట తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం కొడవ సంప్రదాయంలో పెళ్లి జరుగుతుందని సమాచారం. రష్మిక కర్ణాటకలోని కూర్గ్ వద్ద ఉండే కొడవ వర్గానికి చెందిన అమ్మాయి.

ఈ కొడవ సంప్రదాయంలో పెళ్లి ఎలా జరుగుతుందంటే..

కొడవ సంప్రదాయ ప్రత్యేకతలు ఇవే!

కొడవ ప్రజలకు కావేరి నదే దేవత. కొడవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి మంగళసూత్రం ఉండదు. ఒక బంగారు కాయిన్ తాడుకి కట్టి దాన్ని పెళ్లికూతురు భుజానికి కడతారు. అలాగే పెళ్లిలో పురోహితుడు ఉండడు. పెళ్లికూతురు తల్లే పెద్ద దిక్కుగా ఉంటారు. పెళ్లికూతురు తల్లి గిన్నెలో పాలు ఇచ్చి వధూవరులతో తాగిస్తారు. పెళ్లికూతురు రెడ్ కలర్ చీరే కడతారు. చీర కూడా కట్టే పద్ధతి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పెళ్లికి పెళ్లికూతురు ఓ చిన్నబిందె లేదా చెంబుతో నీళ్లు తీసుకొస్తుంది. వెంట ఇద్దరు వదినలు లేదా మరదళ్లు కూడా నీళ్లు తీసుకొస్తారు.

పెళ్లికొడుకు సిక్కుల తరహాలో కత్తి పట్టుకుంటారు. పెళ్లికూతురుకు కూడా చిన్నగా తలపాగా లాంటిది కడతారు. కొడవ పెళ్లిళ్లలో అత్యంత ముఖ్యమైనది డ్యాన్స్, మ్యూజిక్. ప్రత్యేక మైన డ్యాన్స్ ఉంటుంది. పెళ్లికి వెళ్లేదే డ్యాన్స్ చూడడానికి అని చాలా మంది అంటారు. కొడవ ప్రజలు లీగల్ గా గన్ వాడుకోవచ్చు. పెళ్లిలో కూడా గన్ సెల్యూట్ తరహాలో గన్స్ తో సంబరాలు చేస్తారు.

విజయ్, రష్మికల పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూపులు!

ఇక వీరి ఆభరణాల్లో ముఖ్యంగా కొక్కెతాతి అనేది ఉంటుంది. ఇది అర్ధచంద్రాకారంలా ఉంటుంది. అలాగే జోమాలె హారం అని ఉంటుంది. మన సాంప్రదాయంలో నల్లపూసల తాడు లాగానే ఉంటుంది. పెళ్లిలో పెళ్లికూతురు ఈ జోమాలె హారం తప్పనిసరిగా ధరిస్తారు. కొడవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి విందులో పంది కూర, బియ్యపు పిండితో చేసిన రొట్టెలు (కన్నడలో అక్కి రొట్టి), కుడుముల టైప్ లో బియ్యపు పిండితో చేసిన వంటక్లూ కచ్చితంగా ఉంటాయి. కూర్గ్ లో ఉండే ఈ కొడవ సంప్రదాయ వివాహం కర్ణాటకలోనే ఫేమస్.

దీంతో విజయ్ – రష్మిక పెళ్లి కొడవ సంప్రదాయంలో ఎలా జరుగుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు వీరి పెళ్లి ఫోటోల కోసం.

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ జంట ఎలా ఒక్కటవుతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.