
📌 Key Points
- విజయ్ సేతుపతి అసలు పేరు విజయ గురునాథ సేతుపతి కాళీముత్తు.
- దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేసి, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు.
- ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారుగా 150 కోట్లు ఉంటుందని సమాచారం.
- విజయ్ సేతుపతి తన చిరకాల ప్రేయసి జెస్సీని వివాహం చేసుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. ఆయన ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు, ఆయన ఆస్తులు ఎంత అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయ్ సేతుపతి సినీ ప్రస్థానం
HBD Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అసలు పేరు ‘విజయ గురునాథ సేతుపతి కాళీముత్తు. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఎక్కువగా తమిళ్ చిత్రాలతో పాటు తెలుగు, హిందీ భాష చిత్రాలలో కూడా నటిస్తూ పేరు దక్కించుకున్నారు. అంతేకాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా పేరు దక్కించుకున్న విజయ్ సేతుపతి.. పుట్టినరోజు రేపు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కోలీవుడ్ సినీ పరిశ్రమ ముద్దుబిడ్డగా పేరు దక్కించుకున్న ఈయన.. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా.. తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నటుడుగానే కాకుండా విలన్ పాత్రలతో కూడా ఆకట్టుకున్న విజయ్ సేతుపతి అటు కామెడీ పండించడంలో కూడా దిట్ట అని నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రాకముందు దుబాయ్ లో ఒక చిన్న ఉద్యోగం చేసుకునే స్థాయి నుండి నేడు సినిమా స్టార్ గా మారి చెన్నైలో 100 కోట్లకు పైగా విలువైన రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియోను సొంతం చేసుకునే వరకు అతని ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.
విజయ్ సేతుపతి సూక్ష్మమైన నటన, స్క్రిప్ట్ ఎంపికలలో మాస్టర్ కావడానికి ముందు అతని జీవితం ఒక సాధారణ వ్యక్తి లాగే గడిచింది. ఇండస్ట్రీలోకి రాకముందు దుబాయ్లో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఇక తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఎన్నో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ఆ తర్వాతే హీరోగా మారారు. ఇక ప్రస్తుతం ఒకవైపు హీరోగా.. విలన్ గా సినిమాలు చేస్తూనే.. సూపర్ స్టార్ హీరోల చిత్రాలలో అతిధి పాత్రలు పోషిస్తూ అందరిని మెప్పిస్తున్నారు.
ఆస్తుల వివరాలు
విజయ్ సేతుపతి ఆస్తుల విలువ సుమారుగా 150 కోట్లు ఉంటుందని సమాచారం. చెన్నైలో 50 కోట్లు విలువైన నివాసం ఆయన సొంతం. అలాగే కిల్పాక్ , ఎన్నూరులోని లగ్జరీ బంగ్లాను కూడా కలిగి ఉన్నారు. విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. ఇకపోతే సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్న ఈయన అటు చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు..
విజయ్ సేతుపతి తన చిరకాల ప్రేయసి జెస్సీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సూర్య, శ్రీజ. ఇకపోతే విజయ్ సేతుపతి కొడుకు సూర్య ఇప్పటికే నానుమ్ రౌడీ థాన్ సినిమాలో విజయ్ చిన్నప్పటి పాత్రలో నటించాడు. అయితే శ్రీజ మాత్రం ప్రస్తుతం ప్రజల దృష్టికి దూరంగా ఉండాలని తన తల్లి కోరుకుంటున్నట్లు సమాచారం.
వ్యక్తిగత జీవితం
విజయ్ సేతుపతి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 సినిమాలో అతిథి పాత్రను పోషిస్తున్నారు. అలాగే మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ సేతుపతి అనే తాత్కాలిక వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ , టైటిల్ రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
విజయ్ సేతుపతి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ ఉద్యోగి నుండి స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఆయన పట్టుదల, కృషి ఎంతో ఉన్నాయి. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.


