
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ‘ఫీనిక్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన యాక్షన్, ఎమోషన్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
Key Points
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా 'ఫీనిక్స్' తో ఎంట్రీ.
'ఫీనిక్స్' తెలుగు ట్రైలర్ విడుదలై, సినిమాపై అంచనాలు పెంచింది.
యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్.
వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో; విజయ్ సేతుపతి సంతోషం వ్యక్తం చేశారు.
ఫీనిక్స్: తెలుగు ట్రైలర్ విడుదల వివరాలు
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేశాడు . అతను నటించిన తొలి సినిమా తమిళ్ లో ‘ఫీనిక్స్’ పేరుతో ఇప్పటికే విడుదలైంది. అక్కడ ఫర్వాలేదనిపించిన ఈ మూవీ ఇప్పుడు ఇదే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ కానుంది . ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు .
సూర్య సేతుపతి నటన, యాక్షన్ హైలైట్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించారు . జూలై 4న తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది . అయితే , తెలుగు వర్షన్ నవంబర్ 7 న థియేటర్ లో విడుదల కానుంది . ఈమేరకు హైదరాబాద ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించారు .
విజయ్ సేతుపతి కుమారుడిపై ప్రశంసలు
ఫీనిక్స్ సినిమాలో యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్ కూడా సూర్య సేతుపతి పండిచాడు . వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించారు . మీడియా సమావేశంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. తన కుమారుడు ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు . ఎమోషనల్ అండ్ హై యాక్షన్ స్టోరీతో సినిమా తీశామని తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తెలిపారు .
‘ఫీనిక్స్’ సినిమా యాక్షన్, ఎమోషన్ కలగలిసిన అద్భుతమైన కథనంతో తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని విజయ్ సేతుపతి విశ్వాసం వ్యక్తం చేశారు. నవంబర్ 7న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని ఆశిద్దాం.


