
📌 Key Points
- విజయ్, త్రిషల పెళ్లి వార్తలతో కోలీవుడ్‌లో ప్రకంపనలు!
- విడాకుల తర్వాత త్రిషతో విజయ్ జంటగా వివాహ వేడుకలో ప్రత్యక్షం!
- త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
- ఎన్నికల తర్వాత విజయ్, త్రిషల పెళ్లి ప్రకటన ఉంటుందనే టాక్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిషల మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
విజయ్, త్రిషల మధ్య రిలేషన్ నిజమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay)- నటి త్రిష(Trisha) మధ్య నడుస్తున్న రిలేషన్‌షిప్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఇప్పుడు నిజజీవితంలో కూడా వీరు జంటగా మారబోతున్నారనే వార్తలు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల విజయ్-త్రిష కలిసి ఒక వివాహ వేడుకలో జంటగా పాల్గొనడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా వీరిద్దరూ భార్యాభార్తల్లా పక్కపక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులివ్వడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే ఈ ఫోటోలు బయటకు రావడం చర్చకు దారితీసింది.
ఈ రచ్చ ఇలా ఉండగానే, త్రిష చేసినట్లుగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో.. ‘‘ముందు ఎన్నికలు జరగనివ్వండి.. అందరి ఆశీస్సులతో త్వరలోనే ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాం’’ అని రాసి ఉండటం విశేషం. ఇది చూసిన వారంతా విజయ్- త్రిష పెళ్లి గురించే ఆమె హింట్ ఇచ్చిందని అనుకుంటున్నారు. అయితే, త్రిష అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం ఈ పోస్ట్ ఎక్కడా కనిపించడం లేదు. ఆమె పేరు- ప్రొఫైల్ ఫోటోతో ఎవరో కావాలనే దీనిని సృష్టించి వైరల్ చేస్తున్నారా? లేక త్రిష డిలీట్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాంకీ బాయ్ పేజీ ద్వారా ఈ పోస్ట్ ట్రెండ్ అవుతోంది. కాగా.. విజయ్ ఇప్పటికే తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ను స్థాపించి ఎన్నికల బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇమేజ్ చాలా ముఖ్యం కాబట్టి, ఎన్నికల సమయంలో వివాదాలు వద్దని విజయ్ భావిస్తున్నారట. అందుకే ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే త్రిషతో తన బంధాన్ని అధికారికంగా ప్రకటించి, పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరుగుతోంది. link
పెళ్లి చేసుకోబోతున్నారా? వైరల్ అవుతున్న ఫోటోలు!
బిగ్ అనౌన్స్‌మెంట్ వెనుక అసలు రహస్యం ఇదేనా?
విజయ్, త్రిషల పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


