
తమిళ సినీ పరిశ్రమకు విషాదం ఆవహించింది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ గుండెపోటుతో మరణించారు. ‘మధయనాయక్ కూట్టం’, ‘రావణ కొట్టం’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
Key Points
ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ అకాల మరణం
మధురైలో బస్సు ఎక్కుతుండగా గుండెపోటుతో మరణం
మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు దర్శకత్వం
సినిమా పరిశ్రమలో విషాదం, సంతాప ప్రకటనలు
అకాల మరణంతో సినీ ప్రియుల దిగ్భ్రాంతి
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మరణించారు.
విక్రమ్ సుగుమారన్ సినీ జీవితం
శంతను భాగ్యరాజ్, ప్రభు, కతీర్‌తో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్ సుగుమారన్ పనిచేశారు. డైరెక్టర్ మరణం పట్ల నటుడు శాంతను భాగ్యరాజ్ సంతాపం వ్యక్తం చేశారు. మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంత నేర్చుకున్నాననని అన్నారు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచకుంటానని పోస్ట్ చేశారు. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్.. మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
శోక సందేశాలు, సంతాపం
కాగా.. విక్రమ్ సుకుమారన్ 2013లో మధయనాయక్ కూట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కథిర్, అంజు జంటగా నటించారు. అంతకుముందు విక్రమ్.. బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. 2023లో వచ్చిన ‘రావణ కొట్టం’తో సూపర్ హిట్ కొట్టారు. ఆడుకాలం మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఆయన చివరిసారిగా ‘థెరం బోరం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం.
విక్రమ్ సుగుమారన్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటూ, ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.


