|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూడు డిఫరెంట్ పాత్రల్లో హీరో విశాల్- యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్ లుక్స్‌తో మకుటం

Published: 28-08-2025, 12:51 AM
మూడు డిఫరెంట్ పాత్రల్లో హీరో విశాల్- యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్ లుక్స్‌తో మకుటం

వెర్సటైల్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మకుటం. తాజాగా విడుదలైన పోస్టర్‌లో విశాల్ యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ లుక్స్‌లో కనిపించాడు. సముద్రం మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Key Points

1

విశాల్ యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ లుక్స్‌తో మకుటం సినిమాలో కనిపించనున్నారు.

2

సముద్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.

4

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

విశాల్ మూడు విభిన్న పాత్రల్లో

వెర్సటైల్ హీరో విశాల్ డిఫరెంట్ సినిమాలతో అలరిస్తుంటాడు. ఎప్పటికప్పుడు కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలతో తమిళ స్టార్ హీరో విశాల్ ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశాల్ నటిస్తోన్న లేటెసట్ మూవీ మకుటం. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు విశాల్.

సౌత్ హీరో విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వస్తున్న 99వ చిత్రంగా వస్తున్న మకుటంను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక మకుటం మూవీకి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు.

సముద్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌

ఇటీవల రిలీజ్ చేసిన మకుటం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో మకుటం కథ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇక తాజాగా మకుటం సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న మకుటం న్యూ పోస్టర్‌రు విడుదల చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో మూడు విభిన్న గెటప్పులో హీరో విశాల్ కనిపించాడు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ మకుటం సినిమాలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో విశాల్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.

మకుటం సినిమా విశేషాలు

వినాయక చవితి సందర్భంగా విడుదలైన ‘మకుటం’ పోస్టర్ అదిరిపోయేలా ఉంది. ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి , దుషార విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా, మకుటం సినిమాకు హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

దురైరాజ్ కళా దర్శకుడిగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మకుటం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మకుటం రిలీజ్ డేట్, తదితర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అలాగే, ఈ మకుటం సినిమాలో తంబి రామయ్య, అర్జై కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మకుటం సినిమా విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. విశాల్, అంజలి, దుషార విజయన్ నటనతో పాటు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.