
కోలీవుడ్ హీరో విశాల్ తన సినిమాలతో, నడిగర్ సంఘం పనులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. తాజాగా, కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాజకీయం చేయడం ఆపాలని, బాధితురాలిని నిందించవద్దని విశాల్ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
Key Points
విశాల్ వరుస చిత్రాలతో పాటు నడిగర్ సంఘం నిర్మాణంలో బిజీగా ఉన్నారు.
కోయంబత్తూర్ అత్యాచార ఘటనపై ట్విట్టర్‌లో విశాల్ సంచలన పోస్ట్.
సమస్యను రాజకీయం చేయవద్దని, బాధితురాలిని నిందించవద్దని విశాల్ విజ్ఞప్తి.
ఈ దారుణ నేరాలకు మరణశిక్ష విధించాలని గట్టిగా డిమాండ్ చేశారు.
విశాల్ ఆవేదన, ట్విట్టర్ పోస్ట్
కోలీవుడ్ హీరో విశాల్(Vishal) ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల దర్శకుడితో గొడవ ఏర్పడగా.. ‘మకుటం’ (makutam)సినిమాని విశాల్ తెరకెక్కిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ విశాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, ట్విట్టర్ ద్వారా విశాల్ ఓ పోస్ట్ పెట్టారు. గత నెలలో కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార సంఘటనపై సంచనల పోస్ట్ షేర్ చేశారు. ‘‘ఆ సమయంలో బాధితురాలు ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం ఆపండి. మన దేశంలో పునరావృతమయ్యే ఈ రక్తసిక్తమైన అత్యాచారం అనే సమస్యను రాజకీయం చేయడం ఆపండి. కనీసం ఇప్పుడైనా నేను మీ కాళ్ళు మొక్కుతా.
ఈ దారుణమైన నేరానికి మరణశిక్షను అమలు చేయండి. నిర్భయ సంఘటన జరగడం మనం చూశాము. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, తన సొంత తల్లిని హత్య చేసిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో ఒక నిందితుడు నిర్దోషిగా విడుదల కావడం మనం చూశాము. సౌదీ అరేబియాలో ఇది జరుగుతుందా. దోషులుగా తేబడలేరనే భయం. మునుపటి ఉల్లేఖనాలు ఈ నేరస్థులకు పైచేయి ఇస్తున్నాయి. సంవత్సరాల క్రితం APలో ఇటువంటి నేరం జరిగినప్పుడు చర్య తీసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి YSRకి నేను సెల్యూట్ చేస్తున్నాను. చాలా సమయం ఆసన్నమైంది అని అన్నారు.
అత్యాచారాలపై మరణశిక్ష డిమాండ్
రాజకీయాలకు అతీతంగా చూడాలని విజ్ఞప్తి
మొత్తంగా, అత్యాచార నేరాలపై విశాల్ వ్యక్తం చేసిన ఆవేదన, మరణశిక్ష అమలు చేయాలన్న డిమాండ్, సమస్యను రాజకీయం చేయవద్దన్న ఆయన పిలుపు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. న్యాయం జరగాలన్న ఆయన ఆకాంక్ష అందరినీ ఆలోచింపజేస్తుంది.


