|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishnu Vishal: విష్ణు విశాల్ ఆర్యన్.. ఆడియన్స్ దెబ్బకు క్లైమాక్స్‌ కట్‌!

Published: 03-11-2025, 12:45 PM
Vishnu Vishal: విష్ణు విశాల్ ఆర్యన్.. ఆడియన్స్ దెబ్బకు క్లైమాక్స్‌ కట్‌!

విష్ణు విశాల్ నటించిన ‘ఆర్యన్’ సినిమా క్లైమాక్స్‌పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 నిమిషాల క్లైమాక్స్ సీక్వెన్స్‌ను తొలగించి కొత్త వెర్షన్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా నవంబర్ 7న విడుదల కానుంది.

Key Points

1

విష్ణు విశాల్ నటించిన 'ఆర్యన్' సినిమాకు తమిళనాట మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

2

క్లైమాక్స్ సీక్వెన్స్‌పై ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మేకర్స్ కట్ చేశారు.

4

'ఆర్యన్' తెలుగు వెర్షన్ నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

ఆర్యన్ సినిమాకు మిక్స్‌డ్ టాక్

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటేస్ట్ మూవీ ఆర్యన్ . శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు . ఈ క్రైమ్ థ్రిల్లర్ ‌ మూవీ ఇటీవలే తమిళనాడు థియేటర్లలో విడుదలైంది . ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కించారు . కోలీవుడ్ ‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్ ‌ డ్ ‌ టాక్ ‌ వచ్చింది . భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా అంతగా రాణించలేకపోతోంది .

అయితే ఈ మూవీలోని క్లైమాక్స్ ‌ సీక్వెన్స్ ‌ పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి . ఈ మూవీ క్లైమాక్స్ ‌ లో విలన్ ‌ సెల్వ రాఘవన్ ‌ ఆ నలుగురిని ఎందుకు చంపాడనేది ఈ సీన్ ‌ తో సెట్ ‌ కాలేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వేదికగా నిలదీశారు . ఆ సన్నివేశం స్క్రీన్‌ప్లేతో సరిపోలేదని ఆడియన్స్ ‌ అభ్యంతరం వ్యక్తం చేశారు .

క్లైమాక్స్ సీన్‌పై తీవ్ర విమర్శలు

దీంతో ఆర్యన్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు . ఈ మూవీలో కీలకమైన క్లైమాక్స్ ‌ చివరి పది నిమిషాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు . ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో ఆ సీన్లను తీసేసినట్లు తెలిపారు . ఈ రోజు నుంచి థియేటర్లలో సెల్వ రాఘవన్ ‌ క్లైమాక్స్ సీన్స్ ‌ కట్ చేసినట్లు వెల్లడించారు . కొత్త వెర్షన్ సోమవారం నుంచే థియేటర్లలోకి వస్తుందని ఆర్యన్ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుగులో ఆర్యన్ విడుదల ఎప్పుడంటే?

ఈ చిత్రంలోని పది నిమిషాల క్లైమాక్స్ ‌ సీన్స్ ‌ తెలుగు వెర్షన్ నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ అక్టోబర్ 31న విడుదల చేయాలని భావించారు . కానీ రవితేజ మాస్ జతార , ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్‌ రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు . ఈ మూవీని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విష్ణు విశాల్ తన బ్యానర్ ‌ లో నిర్మించారు . ఈ మూవీకి గిబ్రాన్ సంగీతమందించారు .

ప్రేక్షకుల అభిప్రాయాలకు గౌరవమిస్తూ ‘ఆర్యన్’ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్లైమాక్స్ మార్పు తర్వాత సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.