
📌 Key Points
- విశ్వంభర సినిమా VFX నాసిరకంగా ఉండటంతో విడుదల ఆలస్యం.
- చిరు, బాబీ కాంబో సినిమా కూడా డైలమాలో పడిందని వార్తలు.
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల టాక్సిక్ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో చిరు ప్రాజెక్ట్ ఆలస్యం.
- విజయ్ ‘జన నాయగన్’ విషయంలోనూ నెగెటివ్ వైబ్స్.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. VFX నాసిరకంగా ఉండటంతో పాటు, ఇతర ప్రాజెక్టులు కూడా డైలమాలో పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
విశ్వంభర ఆలస్యానికి కారణం ఏమిటి?
Vishwambhara Delay: ఏడు పదులు దాటి నాలుగేళ్లవుతున్నా ఎక్కడా జోష్ తగ్గకుండా వరుస సినిమాల్ని లైన్లో పెడుతున్న చిరు విశ్వంభర విషయంలో మాత్రం హ్యాండ్స్ అప్ చేసినట్టే కనిపిస్తున్నాడు. యస్ ..అచ్చంగా ఆరు నెలల్లోనే మన శంకర వరప్రసాద్ అంటూ సాలిడ్ హిట్ ని డెలివర్ చేసిన చిరు రెండేళ్ళ కిందటే మొదలైన విశ్వంభరని మాత్రం ఇంకా ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతూనే ఉన్నాడు.
ఎలాంటి అప్ డేట్స్ వదలని వశిష్ట
గత సంక్రాంతికి వదిలిన గ్లిమ్ప్స్ లో vfx నాసిరకంగా ఉందన్న నెగిటివ్ కామెంట్స్ మూట గట్టుకున్న వశిష్ట ఆ తర్వాత రామ రామ అంటూ ఏడాదికి ఓ పాటని వదలడం తప్ప ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ వదల్లేదు.అయితే ఇదే UV క్రియేషన్స్ లో నిర్మించిన ‘బైకర్’ సినిమా సైలెంట్‌గా వచ్చి థియేటర్లలోకి వెళ్ళిపోయింది కూడా.కానీ కోట్లు కుమ్మరించిన ‘విశ్వంభర’ విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటికీ నోరు మెదపకపోడం గమనార్హం.దీంతో ‘ఎంత గ్రాఫిక్స్ సినిమా అయినా మరీ ఇన్ని రోజులా,అసలు సినిమా తీస్తున్నావా లేక ఇంకేమైనా చేస్తున్నావా’ అంటూ వశిష్టని చెడుగుడు ఆడేస్తున్నారు మూవీ లవర్స్.మరో వైపు స్వయంగా చిరునే సినిమా జూన్ కాని జులైలో కాని వచ్చే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చినా మేకర్స్ నుండి ప్రమోషన్స్ లో ఎలాంటి పరుగులు కనిపించకపోవడంతో ఈ డౌట్స్ కి మరింత బూస్టప్ వచ్చిన పరిస్థితి.
చిరు, బాబీ కాంబో సినిమా డైలమాలో?
మెగా ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్న వార్తలు
ఇదిలా ఉంటె ఇంకో వైపు kvn బ్యానర్లో చిరు బాబీ కాంబోలో రావాల్సిన సినిమా కూడా డైలమాలో పడిందని సర్క్యులేట్ అవుతున్న వార్తలు మెగా ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయ్.నిజానికి వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ తర్వాత ,చిరు,బాబీ జోడీ కట్టడం,మన శంకరవరప్రసాద్ తర్వాత చిరు చేస్తున్న సినిమా కావడంతో హోప్స్ స్కై లెవల్ లో పెట్టేస్తుకున్నారు ఫ్యాన్స్.కాని ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల ‘టాక్సిక్’ షూటింగ్ కి బ్రేక్ పడిందని,దానివల్ల చిరు ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందన్న వార్తలు మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయ్. దీంతో అసలు “ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ మెగాస్టార్ సినిమా ఆగిపోవడమేంటి?” అంటూ తెగ ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు. ఇక దళపతి విజయ్ చివరి సినిమా’జన నాయగన్’ విషయంలోనూ ఇదే పరిస్థితి.తెలుగులో డెబ్యూ ఇవ్వకముందే మేకర్స్ నెగెటివ్ వైబ్స్‌ని మూటగట్టుకున్న పరిస్థితి.ఏది ఏమైనా మన శంకర వర ప్రసాద్ తో వచ్చిన సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలని ఆశ పడ్డ మెగా ఫ్యాన్స్ కి ఇపుడు నిరాశే మిగులుతోంది.
ఈ గాసిప్స్ పై సరైన అప్ డేట్స్ ఇస్తారా ..
ఇరాన్ యుద్ధం, చిరు సినిమాకు లింక్ ఏమిటి?
ఒక పక్క యువీ క్రియేషన్స్ వారు గ్రాఫిక్స్ సాకుతో, మరోపక్క kvn బ్యానర్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ అడ్డం పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్. మరిఇప్పటికైనా సర్క్యులేట్ అవుతున్న వార్తలపై యువీ, కేవీఎన్ బ్యానర్లు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఫ్యాన్స్ ఇదే నిజమని నమ్మేసినా ఆశ్చర్యం లేదు, చూడాలి మరి త్వరలో అయినా ఈ గాసిప్స్ పై సరైన అప్ డేట్స్ ఇస్తారో లేదో !
మొత్తానికి మెగాస్టార్ సినిమాలు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. విశ్వంభర విడుదల అవుతుందా లేదా వేచి చూడాలి.


