
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రామరామ’ పాటను హనుమాన్ దేవాలయాల్లో ప్లే చేయడంపై ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. మెగా అభిమానులు సెలబ్రేషన్స్ కొనసాగించాలని కోరింది.
Key Points
‘విశ్వంభర’ సినిమా రామరామ సాంగ్ హనుమాన్ దేవాలయాల్లో ప్లే అవుతుంది.
మూవీ టీమ్ స్వయంగా పూజారులకు పెన్ డ్రైవ్‌లు అందించింది.
మెగా అభిమానుల సెలబ్రేషన్స్ కొనసాగించమని టీమ్ కోరింది.
మే 9న విడుదల కానున్న ‘విశ్వంభర’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
‘విశ్వంభర’ టీమ్ యొక్క ఆశ్చర్యకరమైన నిర్ణయం
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). వశిష్ట(Vasishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. సోసియో-ఫాంటసీ ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎం. ఎం. కీరవాణి వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో త్రిష(Trisha), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే9న థియేటర్స్‌లోకి రాబోతుంది.
రామరామ సాంగ్‌కు దేవాలయాలలో ప్రత్యేక స్థానం
ఈక్రమంలో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, రామ రామ సాంగ్ భారీ రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఇటీవల విడుదలైన త్రిష పోస్టర్ కూడా అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అత్యధిక వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టాయి. అయితే విశ్వంభర లోని రామరామ సాంగ్‌ను తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లోని ప్లే చేయనున్నట్లు గత కొద్దికాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగా అభిమానుల ఆనందోత్సాహం
దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు అలా జరిగితే బాగుంటుందని భావించారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ విషయంపై స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. విశ్వంభరలోని ‘రామరామ’ పాటను తెలుగు రాష్ట్రాలలోని హనుమాన్ దేవాలయాలలో పెన్ డ్రైవ్‌లను పంపిణీ చేసిన వీడియో షేర్ చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా విశ్వంభర మూవీ టీమ్ వెళ్లి పూజారులకు అందించారు. ఈ వీడియో షేర్ చేస్తూ అభిమానులు సెలబ్రేషన్స్ కొనసాగించండి అనే క్యాప్షన్ జత చేశారు.
చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం కోసం మెగా అభిమానులు చేస్తున్న సెలబ్రేషన్స్‌కు మూవీ టీమ్ మద్దతు తెలిపింది. రామరామ పాట ద్వారా మరింత ఆకర్షణ పెంచుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నారు.


