|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వంభర: చిరు అసంతృప్తి! విడుదలపై నీలినీడలు.. నిర్మాతల షాకింగ్ నిర్ణయం!

Published: 12-02-2026, 2:05 PM
  • చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం అవుట్‌పుట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు.
  • దర్శకుడు వశిష్ట మరిన్ని VFX షాట్స్ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.
  • నిర్మాతలు చేతులెత్తేయడంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.
  • సినిమా విడుదల ఆలస్యం కావడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి అవుట్‌పుట్‌తో సంతృప్తి చెందలేదని, నిర్మాతలు కూడా నిధులు ఆపేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

విశ్వంభర అవుట్‌పుట్‌పై చిరు అసంతృప్తి?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి టాలీవుడ్‌లో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఈ సినిమాను చూసి, డిజప్పాయింట్ అయినట్లుగా టాక్ నడుస్తుంది. ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా కంటే ముందు విడుదల కావాల్సిన చిత్రమిది. ఇంకా చెప్పాలంటే 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, చివరి నిమిషంలో వాయిదా పడింది. అప్పటి నుంచి టీజర్, ఒక పాట, కొన్ని పోస్టర్స్ మినహా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో సినిమాపై అనుమానాలు, రకరకాలుగా వార్తలు మొదలయ్యాయి. ఎందుకంటే, లాస్ట్ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా, ఈ సంక్రాంతికి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. ఆ సినిమా తర్వాత చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం థియేటర్లలోకి రావడం, బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం జరిగిపోయింది. అయినా కూడా ‘విశ్వంభర’ జాడ లేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే..

నిర్మాతల నిధుల కొరత.. విడుదల వాయిదా?

మొన్నటి వరకు బిజినెస్ జరగలేదు, అందుకే ఆలస్యం అవుతుందనేలా వార్తలు వినిపించాయి. కానీ దర్శకుడి వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఇంకొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ రావాలని, అవన్నీ వచ్చిన తర్వాత మెగాస్టార్‌కి ఒకసారి చూపించి, అప్పుడు విడుదల తేదీని కన్ఫర్మ్ చేస్తామని వశిష్ట చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇలా వైరల్ అవుతుండగానే, ఈ సినిమాను మళ్లీ చిరంజీవి (Megastar Chiranjeevi) చూశారని, అవుట్‌పుట్ అస్సలు నచ్చలేదని చెబుతూ దర్శకుడిపై సీరియస్ అయ్యారనేలా టాక్ నడుస్తుంది. మళ్లీ కొంత వర్క్ చేయడానికి నిర్మాతలు మా దగ్గర డబ్బుల్లేవ్ అని చేతులెత్తేశారనేలా కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఏంటనేది మాత్రం మేకర్స్ రియాక్ట్ అయితేనే తెలుస్తోంది. ఏది ఏమైనా ‘విశ్వంభర’ విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా బాగా వర్రీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో..

మెగా ఫ్యాన్స్ ఆందోళన.. కారణం ఇదే!

సాలిడ్ కంటెంట్ వదిలితే తప్ప, ఈ సినిమాపై అటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, అలాగే ఫ్యాన్స్‌కు నమ్మకం రాదు. అలా చేయలేదంటే, ఎవడికి పడితే వాడు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. దర్శకుడు మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అంటున్నారు. మరోవైపు ఇలాంటి వార్తలు.. ఏది నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. మరి మేకర్స్ ఒక మీడియా సమావేశం నిర్వహించి, ‘విశ్వంభర’పై ఫుల్ క్లారిటీ ఇస్తే తప్ప.. ఇలాంటి వార్తలు ఆగవు. చూద్దాం మరి.. మేకర్స్‌లో ఏమైనా కదలిక వస్తుందో.. లేదంటే, సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా.. ఇలాంటి రూమర్స్‌తోనైనా సినిమా వార్తలలో ఉందని వాళ్లు కూడా హ్యాపీగా ఉన్నారో..

మొత్తానికి ‘విశ్వంభర’ సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఈ సందిగ్ధత మెగా అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.