|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వప్రసాద్‌ వ్యాఖ్యలు కార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయి: ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్

Published: 09-08-2025, 5:18 AM
విశ్వప్రసాద్‌ వ్యాఖ్యలు కార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయి: ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్

ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు సినీ కార్మికులను ఆగ్రహానికి గురిచేశాయి. ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు విశ్వప్రసాద్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఆయనకు అవగాహన లేదని ఆరోపించారు.

Key Points

1

టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై సినీ కార్మికుల ఆగ్రహం.

2

ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు ఆవేదన వ్యక్తం.

4

ఫిలిం ఫెడరేషన్ నాయకులపై వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్.

టైగర్ రాజు ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ( TG Vishwa Prasad ) వ్యాఖ్యలు సినీకార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయని సినిమా ఆర్టిస్ట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ టైగర్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్వప్రసాద్‌కు సినిమా ఇండస్ట్రీపై అవగాహన లేదని, ఆయన ఫిలిం ఫెడరేషన్‌ నాయకులపై వేసిన కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విశ్వప్రసాద్ వ్యాఖ్యల విమర్శ

ఆయన మాటలు దారుణం శనివారం నాడు సాక్షి టీవీతో టైగర్‌ రాజు మాట్లాడుతూ.. చిరంజీవిని కలిసి మా సమస్యలను విన్నవించాము. రేపటి వరకు నిర్మాతలు ఏమీ తేల్చకపోతే సోమవారం నుంచి ఆయన షూటింగ్‌కు ఫెడరేషన్ కార్మికులకు 30 శాతం జీతాలు పెంచి షూటింగ్ జరుపుతానని చెప్పారు.  మా సమస్యకు పరిష్కారం దొరుకుతున్న సమయంలో విశ్వప్రసాద్‌ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నిర్మాత సి.కల్యాణ్‌ కూడా కార్మికుల నుంచి వచ్చినవాడే.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు,

కార్మికులకు 30% జీతం పెంపు ప్రతిపాదన

విశ్వప్రసాద్ వ్యాఖ్యలతో సినీ కార్మికులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.