
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేళ, ఆయన నటించిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఒక రోజు ముందుగానే విడుదల చేసిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ నటిస్తున్నారు.
Key Points
చిరంజీవి 70వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు 'విశ్వంభర' గ్లింప్స్ విడుదల.
ఫ్యాంటసీ యాక్షన్ మూవీలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుందని గ్లింప్స్ సూచిస్తోంది.
త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
2026 సమ్మర్‌లో సినిమా విడుదల కానున్నట్లు చిరంజీవి ప్రకటించారు.
విశ్వంభర గ్లింప్స్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు విశ్వంభర టీమ్ మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. శుక్రవారం (ఆగస్టు 22) చిరు తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ ఒక రోజు ముందే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీలో చిరంజీవి నట విశ్వరూపం చూపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న మూవీ విశ్వంభర . ఆ సినిమాతో తన కెరీర్లో మెగా హిట్ సొంతం చేసుకున్న అతడు.. రెండో సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవితో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. విశ్వంభర అంటూ ఈసారి మైథలాజికల్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా గురువారం (ఆగస్టు 21) సాయంత్రం 6:06 గంటలకు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
చిరంజీవి యొక్క అద్భుతమైన నటన
ఒక నిమిషం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేపుతోంది. కొన ఊపిరితో ఉన్న ఓ సమూహానికి జీవం పోసే నాయకుడిగా చిరంజీవిని ఇందులో పరిచయం చేశారు. ఒక్కడి స్వార్థంతో మొదలైన యుద్ధాన్ని కొన్ని యుగాల పాటు చెప్పుకునేలా ముగిస్తాడంటూ చిరు గురించి చెప్పే ఇంట్రో అదిరిపోయింది. ఆ తర్వాత మెగాస్టార్ ఎంట్రీ కూడా అదే స్థాయిలో ఉంది.
వశిష్ట డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మూవీని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిరంజీవి ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. 2023లోనే మెగా 156ను అనౌన్స్ చేసినా.. ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని భావించినా చాలా ఆలస్యమవుతోంది.
2026 సమ్మర్ లో విడుదల
దీని గురించి చిరంజీవి ఇంకా ఏం చెప్పాడంటే.. “నేను మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. ఈ సినిమాపై ఎందరికో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. విశ్వంభర ఎందుకు లేట్ అవుతుందని అడుగుతున్నారు. కానీ, విశ్వంభర ఆలస్యం కావడం సముచితమే. ఎందుకంటే విశ్వంభర సెకండాఫ్ అంతా గ్రాఫిక్స్‌తోనే నిండి ఉంటుంది” అని చిరంజీవి అన్నాడు.
“ఆ గ్లింప్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. అది సరే కానీ విశ్వంభర రిలీజ్ డేట్ చెప్పట్లేదు అనుకుంటున్నారా. అది కూడా నేను లీక్ చేసేస్తున్నాను. పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలు కూడా చూసేలా 2026 సమ్మర్ కు విశ్వంభరను మీరు థియేటర్లలో కచ్చితంగా చూస్తారు” అని చిరంజీవి వెల్లడించాడు.
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాపై అభిమానుల ఆసక్తిని గ్లింప్స్ మరింత పెంచింది. 2026లో విడుదల కానున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.


