|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వితికా శేరు సంచలన నిర్ణయం! ఆ ఒక్క తప్పే నన్ను తల్లిగా చూడనివ్వలేదు!

Published: 12-04-2026, 6:35 AM
వితికా శేరు సంచలన నిర్ణయం! ఆ ఒక్క తప్పే నన్ను తల్లిగా చూడనివ్వలేదు!
  • వితికా, వరుణ్ తొమ్మిదేళ్ల వివాహ బంధంలో ఇంకా పిల్లలు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
  • 21 ఏళ్లకే వరుణ్‌ను పెళ్లి చేసుకున్న వితికా.. అమెరికాలో గర్భం దాల్చింది.
  • గర్భస్రావం తర్వాత ఒక చిన్న ముక్క గర్భసంచిలోనే ఉండిపోవడంతో మరోసారి అబార్షన్ జరిగింది.
  • సకాలంలో వైద్యం చేయించుకోకపోవడంతోనే మాతృత్వం ఆలస్యమవుతోందని వితికా భావిస్తోంది.

టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్, వితికా శేరుల జీవితంలో జరిగిన విషాదకర సంఘటనను వితికా పంచుకున్నారు. గర్భస్రావం కారణంగా ఆమె పడ్డ మానసిక వేదన గురించి తెలియజేస్తూ, మాతృత్వం ఆలస్యం కావడానికి గల కారణాలను వివరించారు.

వితికా, వరుణ్ ల వివాహ జీవితం

Vithika sheru: టాలీవుడ్ క్యూట్ కపుల్ వరుణ్ సందేశ్ – వితికా శేరు జంటను చూడగానే అందరికీ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్నా, వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. అయితే, వీరికి ఇంకా పిల్లలు కలగకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుంటాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, తన జీవితంలో జరిగిన ఒక విషాదకర సంఘటనను వితికా తాజాగా పంచుకున్నారు. తను ఎదుర్కొన్న గర్భస్రావం మరియు ఆ తర్వాత పడ్డ మానసిక వేదన గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వితికా శేరు కెరీర్ మంచి జోరులో ఉన్నప్పుడే, 21 ఏళ్ల వయసులో వరుణ్ సందేశ్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వరుణ్‌కు కూడా కేవలం 24 ఏళ్లే. సినిమా రంగంలో ఉన్నప్పటికీ, కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఈ జంట ముందుకు సాగింది. ఇక పెళ్లైన కొత్తలో అంతా హాయిగా సాగిపోయింది. అయితే, సెలబ్రిటీ కావడంతో ఎక్కడికి వెళ్లినా “పిల్లలు ఎప్పుడు?” అనే ప్రశ్న ఎదురయ్యేది. దాని వెనుక ఉన్న అసలు బాధ ఎవరికీ తెలియదని వితికా తాజా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాలో గర్భస్రావం.. విషాదం

2019లో వరుణ్, వితికా అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న ఆరు నెలల కాలంలోనే వితికా గర్భవతి అయ్యారు. ఆ వార్త వినగానే ఇరు కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి. కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇక అనుకోని కారణాల వల్ల ఆమెకు గర్భస్రావం (Miscarriage) జరిగింది. ఆ బాధ నుంచి తేరుకోలేక వారు వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఇక్కడకు వచ్చాక కూడా మరో రెండు నెలల పాటు వితికాకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి.

ఇండియా వచ్చాక పీరియడ్స్ రాకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ మరో షాకింగ్ విషయం తెలిసింది. అమెరికాలో గర్భస్రావం జరిగినప్పుడు బేబీకి సంబంధించిన ఒక చిన్న ముక్క గర్భసంచిలోనే ఉండిపోయిందట. దానివల్ల మళ్ళీ గర్భం దాల్చినట్లు అనిపించినా, అది ప్రాణాపాయమని తెలిసి డాక్టర్లు రెండోసారి అబార్షన్ చేసి గర్భసంచిని క్లీన్ చేశారు. ఇక ఈ వరుస సంఘటనలు వితికాను శారీరకంగా, మానసికగా ఎంతో కుంగదీశాయి. ఆ సమయంలో వరుణ్ ఇచ్చిన తోడ్పాటుతోనే ఆమె మళ్లీ మామూలు మనిషి అయ్యారు. వాస్తవానికి గర్భం దాల్చిన 40 రోజుల్లోనే తాను ఎక్కువగా ప్రయాణం చేయడం వల్లే గర్భస్రావం అయ్యింది. ఆ విషయం ఆ సమయంలో తెలియలేదు. నాడు చేసిన ఆ అజాగ్రత్త , తప్పు వల్లే ఇప్పటికీ మాతృత్వాన్ని పొందలేకపోతున్నాను అంటూ కాస్త ఇన్ డైరెక్ట్ గానే ఎమోషనల్ అయ్యింది..

మాతృత్వంపై వితికా ఆవేదన

ప్రస్తుతం వితికా తన కెరీర్, ఇల్లు మరియు ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టారు. “దేవుడు మేము బాగా సెటిల్ అయ్యాకే పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నాడేమో” అని ఆమె భావిస్తున్నారు. పిల్లలు పుట్టాక వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలని, అందుకే ఇప్పుడు సంపాదనపై ఫోకస్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక త్వరలోనే అంతా బాగున్నప్పుడు మాతృత్వాన్ని పొందుతానని, ఒకవేళ గర్భం దాలిస్తే అందరికీ చాటింపు వేసి మరీ చెబుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వితికా ధైర్యాన్ని చూసి అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

గతంలో జరిగిన పొరపాట్ల కారణంగానే ఇప్పటికీ మాతృత్వం పొందలేకపోతున్నానని వితికా బాధపడుతుంది. అయితే, ఆమె త్వరలోనే ఆ బాధ నుంచి బయటపడి తల్లి అవుతారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.