|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vithika Sheru Sister: అప్పుడు సింపుల్‌గా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా

Published: 08-11-2025, 6:51 AM
Vithika Sheru Sister: అప్పుడు సింపుల్‌గా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా

టాలీవుడ్ నటి వితికా షేరు తన చెల్లి కృతిక సీమంతం వేడుక విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. మొదట స్నేహితులతో సింపుల్‌గా జరిపిన బేబీ షవర్, ఆపై కుటుంబ సభ్యులతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Key Points

1

నటి వితికా షేరు తన చెల్లి కృతిక సీమంతం వేడుక విశేషాలను పంచుకున్నారు.

2

కృతికకు మొదట స్నేహితులతో సింపుల్‌గా, ఆపై కుటుంబంతో సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు.

4

వితికా షేరు ఈ శుభకార్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వితికా షేరు చెల్లి కృతిక సీమంతం వేడుక

హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి వచ్చిన తెలుగమ్మాయి వితికా షేరు.. తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్‌ని తర్వాత కొన్నాళ్లకు పెళ్లిచేసుకుంది. మధ్యలో వీళ్లిద్దరూ కలిసి బిగ్‌బాగ్ 3వ సీజన్‪లో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఈ షో నుంచి వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు గానీ వితిక మాత్రం యూట్యూబ్‍‌లో వీడియోలు చేస్తోంది.

ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే విశేషాలని పంచుకునే వితికా షేరు.. తన చెల్లి క్రితిక సీమంతం చేసిన విషయాన్ని పంచుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలు, యూట్యూబ్‌లో ఈ శుభకార్యానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో వితిక కుటుంబంతో పాటు క్రితిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా కనిపించారు.

ఒకటి కాదు రెండు సార్లు సీమంతం!

‘సీమంతం అనేది మహిళ జీవితంలో ఓ అందమైన సంప్రదాయ వేడుక. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు. అమ్మతనం, ప్రేమ అనే కొత్త ప్రారంభానికి ఇదో సెలబ్రేషన్’ అని వితిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇకపోతే నెలన్నర క్రితం అంటే సెప్టెంబరు చివరి వారంలోనూ చెల్లికి సింపుల్‌గా బేబీ షవర్ (సీమంతం) చేసింది. అప్పుడు కేవలం స్నేహితురాళ్లతో దీన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకని జరుపుకొన్నారు.

అమ్మతనం వైపు కృతిక ప్రయాణం

చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్‌ ఫోటోలను సైతం షేర్‌ చేసింది. ఇప్పుడు సీమంతం జరిగింది.

మొత్తానికి, వితికా షేరు చెల్లి కృతిక సీమంతం ఒక అందమైన కుటుంబ వేడుకగా మారింది. అమ్మతనం వైపు సాగే కృతిక ప్రయాణానికి ఇది ఆరంభం. సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు, వీడియోలు వారి సంతోషాన్ని చాటుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.