|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వివో X ఫోల్డ్ 6 వచ్చేసింది! అద్భుతమైన ఫీచర్లు, ధరతో సంబంధం లేకుండా కొనేస్తారు!

Published: 08-07-2026, 4:49 AM

వివో అభిమానుల నిరీక్షణకు తెరపడింది! సరికొత్త వివో X ఫోల్డ్ 6 మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అద్భుతమైన 8.02-అంగుళాల డిస్‌ప్లే, శక్తివంతమైన డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 200MP కెమెరా వంటి మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

Key Points

1

వివో X ఫోల్డ్ 6 8.02-అంగుళాల ఇన్నర్ అమోల్డ్, 6.51-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వస్తుంది.

2

మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

3

200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలతో వస్తుంది.

4

7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, ధర సుమారు రూ. 1,11,000 నుండి ప్రారంభమవుతుంది.

వివో X ఫోల్డ్ 6: ధర వివరాలు

Vivo X Fold 6 Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో లవర్స్ కోసం సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్ 6లో 8.02-అంగుళాల శాంసంగ్ M14 ఇన్నర్ ఫోల్డబుల్ అమోల్డ్ స్క్రీన్ 6.51-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫోన్ బుక్ షేప్ మాదిరిగా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివో ఎక్స్ ఫోల్డ్ 6 ధర ఎంతంటే? : ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,999 (సుమారుగా రూ. 1,11,000), 12GB + 512GB వేరియంట్ (Vivo X Fold 6 Launch) ధర CNY 8,999 (సుమారుగా రూ. 1,25,000), 16GB + 512GB వేరియంట్ ధర CNY 9,999 (సుమారుగా రూ. 1,38,700), 16GB + 1TB వేరియంట్ ధర CNY 10,999 (సుమారుగా రూ. 1,52,600) ఉంటుంది. వివో ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ గోల్డ్ ఎడిషన్‌ను కూడా CNY 10,999 (సుమారుగా రూ. 1,56,800) ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సాల్ట్ లేక్, బ్లూ హోల్ పోలార్ నైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Redmi 17C : సూపర్ ఫోన్ బ్రో.. 5,160mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మి 17C ఫోన్.. ధర చాలా తక్కువ..!

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్

వివో Xఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ డ్యూయల్ సిమ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4K కంటెంట్ సపోర్ట్‌తో 8.02-అంగుళాల (2,504 x 2,312 పిక్సెల్స్) లోపలి ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. బయటి డిస్‌ప్లేలో 6.51-అంగుళాల (1,120 x 2,528 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్ ఉంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు డిస్‌ప్లేలలో 20MP కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8K వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు.

కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్లు

కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4జీ, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, BeiDou, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెన్సార్లుగా గైరోస్కోప్, ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్ గ్రావిటీ సెన్సార్ ఉన్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 157.16 x 145.66 x 4.40mm ఫోల్డ్ చేస్తే స్క్రీన్ 157.16 x 74.26 x 9.40mm ఉంటుంది. ఈ డివైజ్ బరువు సుమారుగా 228 గ్రాములు ఉంటుంది.

వివో X ఫోల్డ్ 6 దాని అత్యాధునిక ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. అధిక ధర ఉన్నప్పటికీ, దీని అద్భుతమైన స్పెసిఫికేషన్లు టెక్ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.