
📌 Key Points
- వివో X300 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
- ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది.
- కెమెరాల విషయానికొస్తే, వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
- వివో X300 FE 6500mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
వివో అభిమానులకు ఒక శుభవార్త! వివో X300 FE త్వరలో భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తోంది.
వివో X300 FE స్పెసిఫికేషన్లు, డిజైన్
Vivo X300 FE : వివో ఫ్యాన్స్ కోసం కిర్రాక్ ఫోన్ వస్తోంది.. వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. వివో ఎక్స్300 ఎఫ్ఈ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vivo X300 FE : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో కెమెరా-సెంట్రలైజడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివో X300 అల్ట్రా, వివో X300s మోడల్స్ ఇటీవలే లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు, ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారత మార్కెట్లో కూడా ఈ లైనప్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.
డిసెంబర్ 2025లో లాంచ్ అయిన ప్రస్తుత వివో X300 వివో X300 ప్రో మోడళ్లతో (Vivo X300 FE) పాటు వివో X300 FE కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన లేదు. రాబోయే వివో X300 FE ఫోన్ సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
వివో X300 FE స్పెసిఫికేషన్లు, డిజైన్, కలర్లు (అంచనా) : భారతీయ వేరియంట్ వివో X300 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా.
కెమెరా మరియు బ్యాటరీ వివరాలు
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB LPDDR5x అల్ట్రా ర్యామ్ 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వచ్చే అవకాశం ఉంది.
Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..! రూ. 360 నుంచి రూ. 7500 వరకు DA పెంపు? మీ శాలరీ ఎంత పెరుగుతుందంటే?
కెమెరాల విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ 50MP టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
భారత్‌లో వివో X300 FE ధర, లాంచ్ తేదీ (అంచనా)
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 6500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే రష్యా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యక్షమైంది. వైట్, పర్పల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్ కోసం ఈ టెక్ దిగ్గజం అదనంగా గ్రీన్ వేరియంట్‌ను తీసుకురానుందని లీకులు సూచిస్తున్నాయి.
భారత్‌లో వివో X300 FE లాంచ్ తేదీ ధర (అంచనా) : టిప్‌స్టర్ ప్రకారం.. వివో X300 FE మే 7న భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. వివో ఎక్స్300 అల్ట్రా సేల్ మే 14న ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అంచనాల ప్రకారం.. బేస్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 54,999 ఉండవచ్చు.
వివో X300 FE భారత మార్కెట్లో విడుదల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఒక శుభవార్త. ఫీచర్లు, ధర ఆకర్షణీయంగా ఉంటే, ఇది మార్కెట్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది.


