|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాఖలో హృదయ విదారక ఘటన: ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి!

Published: 30-03-2026, 12:05 AM
విశాఖలో హృదయ విదారక ఘటన: ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి!
  • విశాఖలో నేవీ ఉద్యోగి ప్రియురాలిని హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికాడు.
  • మృతురాలు మౌనిక(28)గా గుర్తించబడింది, నిందితుడు రవీంద్ర వివాహితుడు.
  • రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.
  • నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.

విశాఖపట్నంలో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడు రవీంద్ర పోలీసులకు లొంగిపోయాడు.

ఘటన స్థలం, నేరం వివరాలు

విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. వివాహితుడైన ఓ నేవీ ఉద్యోగి… మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. ఇటీవలే వీరిద్దరి మధ్య విభేదాల తలెత్తాయి. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలు మౌనిక(28)ను ఇంటికి పిలిచి… అత్యంత దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచి, మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచాడు.

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఇండియన్‌ నేవీలో రవీంద్ర అనే వ్యక్తి ఎయిర్‌ క్రాప్ట్‌ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్నాడు. గాజువాక పరిధిలోని ఎల్‌వీనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రవీంద్రకు పెళ్ళై భార్య ఉండగా…. కైలాసపురం ప్రాంతానికి చెందిన మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

నిందితుడి నేరాంగీకారం

కొన్ని రోజుల కిందట రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అర్ధరాత్రి దాటిన తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కోపోద్రిక్తుడైన రవీంద్ర…. ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి… సగ భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు.

అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించి, లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా… తనను మౌనిక డబ్బుకోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించినట్టు సమాచారం. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు

మృతురాలికి సంబంధించిన వివరాలు, హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతుండగా…. కీలక విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఈ ఘటన విశాఖలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.