|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vrusshabha Movie: మోహన్‌ లాల్ వృషభ.. కొత్త రిలీజ్‌ డేట్ వచ్చేసింది!

Published: 09-10-2025, 7:16 AM
Vrusshabha Movie: మోహన్‌ లాల్ వృషభ.. కొత్త రిలీజ్‌ డేట్ వచ్చేసింది!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘వృషభ’. దీపావళికి వస్తుందనుకున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ‘వృషభ’ సందడి చేయనుంది.

Key Points

1

మోహన్ లాల్ ద్విభాషా చిత్రం 'వృషభ'కు నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

2

వృషభ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

4

ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు.

వృషభ మూవీ: పాన్ ఇండియా విశేషాలు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే టీజర్ టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించడం విశేషం. ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయిచే ఈ ఫుల్ యాక్షన్‌ మూవీ దీపావళికి రిలీజ్‌ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ ఈ దీపావళికి థియేటర్లలో వృషభ రిలీజ్ కావడం లేదు. తాజాగా కొత్త రిలీజ్‌ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల అంటే నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని స్పెషల్ పో‍స్టర్‌ను పంచుకున్నారు. ఇ‍ప్పటికే రిలీజైన టీజర్‌ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు.

మోహన్ లాల్ పాత్ర, టీజర్ హైలైట్స్

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

మోహన్ లాల్‌ను రాజు పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.