|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవిని టార్గెట్ చేస్తే అంతే సంగతులు! వివి వినాయక్ సంచలన హెచ్చరిక!

Published: 28-03-2026, 6:35 PM
చిరంజీవిని టార్గెట్ చేస్తే అంతే సంగతులు! వివి వినాయక్ సంచలన హెచ్చరిక!
  • చిరంజీవిని విమర్శిస్తే నాశనమవుతారని వివి వినాయక్ హెచ్చరించారు.
  • నంది అవార్డుల నిర్వహణను ప్రభుత్వం ప్రోత్సహించాలని చిరంజీవి కోరారు.
  • చిరంజీవి వ్యాఖ్యలను కొందరు కావాలనే వివాదం చేస్తున్నారని వినాయక్ అన్నారు.
  • సినీ పరిశ్రమ అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే వారిని దర్శకుడు వివి వినాయక్ హెచ్చరించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని ఆయన అన్నారు. నంది అవార్డుల గురించి చిరంజీవి చేసిన సూచనలను ఆయన సమర్థించారు.

చిరంజీవి వ్యాఖ్యలపై వివాదం

VV Vinayak: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు కాంట్రవర్సీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మంచి విషయం చెప్పినా కూడా, దానిని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కళాకారులను గౌరవించాలని, నంది అవార్డ్స్ (Nandi Awards) వంటి వేడుకను నిర్వహించాలని, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని మెగాస్టార్ అన్నారు. దీనిని కొందరు విషయం అర్థం చేసుకోకుండా, చంద్రబాబుకు చెప్పేటంతటి వాడివా? అంటూ, కొందరు కావాలని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని టీడీపీకి చెందిన సానుభూతిపరులు కూడా ఈ విషయంపై ఇష్టం వచ్చినట్లుగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు.. ఒక అభిమానికి మీకు ఏమని అనిపిస్తుంది? అని దర్శకుడు వివి వినాయక్‌ (VV Vinayak)ను అడిగితే..

‘‘మెగాస్టార్ గురించి అలా మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ.. ఏదైనా మాట్లాడితే కాంట్రవర్షియల్‌గా ఉంటుంది. మేము అలా మాట్లాడితే.. అంటే సపోజ్ నేను తిరిగి మాట్లాడినా కూడా.. మెగాస్టార్ మమ్మల్ని తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఇంత కూడా తప్పు లేదు. అప్పట్లో చాలా రంగ రంగ వైభవంగా నంది అవార్డ్స్ జరిగేవి.. ఉగాది రోజు పండగంతా ఈ వేడుకలోనే ఉన్నట్టు ఉండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు. ఉగాది రోజు ఈవెనింగ్ టీవీల ముందు పెద్ద సెలబ్రేషన్ జరిగేది. అది ఆయన అలా కోరుకోవడం ఆయన గురించి కాదు కదా! ఆయనకు అవార్డుల ఎందుకు.. అందరూ ఆనందపడతారనే ఉద్దేశంతోనే కదా అన్నంది. ఇంకా అది కూడా తప్పే అంటే ఎలా?

విమర్శకులకు వివి వినాయక్ స్ట్రాంగ్ వార్నింగ్

నేనిక్కడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన్ని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా పాడైపోతారు. ఎనీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్లే ఆలోచించుకోండి.. దయచేసి అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద.. దగ్గరగా ఉన్న నాలాంటి వాడికి తెలుసు ఆయన శక్తి ఏంటీ అనేది. ఎప్పుడూ కూడా.. ఏదో ఒక మంచి వ్యక్తిని ఏమన్నా అంటే.. అది డెఫినెట్ గా కొడుతుంది. ఎందుకో తెలీదు, కావాలంటే చూసుకోండి.. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇండస్ట్రీలో లేరు, ఏదో రకంగా పాడైపోయారు. అసలు ఆయన స్టేటస్ ఏంటి? ఆయనేంటి? ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు ఫ్యాన్స్ ఉన్నారు.

నాకు తెలుసు.. ఒకసారి ఒక ప్రొడ్యూసర్ విషయంలో కొన్ని బస్సులు వేసుకుని ఒక ఐదు ఆరు వందల మంది వచ్చేశారు. ఒక ప్రొడ్యూసర్ ఏదో కామెంట్ చేశాడు. అంతే వాడిని అది చేస్తాం, ఇది చేస్తాం అని బీభత్సంగా అభిమానులు వచ్చేశారు. అప్పుడు మెగాస్టార్ ఏం చేశారంటే, వాళ్ళందరినీ ‘చెప్పుతీసుకుని కొడతా.. తమాషాలు ఆడుతున్నారా.. నన్ను అంటే మీకు ఏమైంది’ అని అంటే.. ‘అదేంటి మిమ్మల్ని అంటే మాకు బాధ కాక ఇంక ఎవరికి ఉంటుంది’ అని వాళ్లు అనడం.. ఆరోజు అంతా వాళ్లని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోయింది. నిజంగా ఆయన నాలుగు మెట్లు దిగితే ఎన్నో మాటలు మాట్లాడగలరు? ఆయన తరపున ఉన్నవాళ్ళు అసలేం చేయగలరో ఊహించలేరు?

నంది అవార్డుల ప్రాముఖ్యతను గుర్తు చేసిన చిరు

ఎందుకు, ఇలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడతారు. ఇవన్నీ చెత్త చెత్త విషయాలు. ఆయన ఇండస్ట్రీ తరపున అడిగారు . ఆయనకేమన్నా కావాలని అడిగారా? ఆయన ఏం మాట్లాడినా కామెంట్ చేసేస్తారు.. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేసేస్తారు. ఏం మాట్లాడకూడదా? చక్కగా నంది అవార్డ్స్ ఫంక్షన్ చేస్తే ఏముంది? అందులో తప్పేముంది? చేస్తే అందరికీ నంది అవార్డ్స్ ఇచ్చారు అని గవర్నమెంట్ కి పేరు వస్తుంది, అంతే కదా! ఆయన ఎవరి పేరు తీసి ఏమీ అనలేదు కదా! ఇలాంటి మాటలు వింటే నిజంగా చాలా బాధేస్తుంది.

సింపుల్‌గా ఒక్క విషయం చెప్తాను.. చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రమాణ స్వీకారానికి చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ గారిని ఇక్కడ అన్నయ్య ఉన్నారని అనగానే.. ఫస్ట్ మోడీ గారే లేచి వచ్చి చిరంజీవి గారిని కలిశారంటే.. ఆయన గురించి మోడీ గారికి ఏమీ తెలియదా? ‘చిరంజీవిగారిని మోడీ గారి దగ్గరికి తీసుకెళ్తారు ఎవరైనా’. కానీ ‘మా అన్నయ్య’ అనగానే ఆయనే లేచి వెళ్లారు. ఇంకా ఎక్కడో అల్లూరి సీతారామరాజు ఫంక్షన్ జరుగుతుంటే.. గవర్నమెంట్‌కి, ప్రభుత్వానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆ రోజు మన తెలుగు వాడిగా చిరంజీవిగారిని గౌరవించి ఆయనని ఇన్వైట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్. అల్లూరి సీతారామరాజు ప్రోగ్రాం అది.. వెస్ట్ గోదావరి. ఆయనని బయట అంతగా కీర్తిస్తూ, అంత ఇది చేస్తుంటే.. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళం మనం తిట్టుకుంటూ కూర్చుని, మనమే కామెంట్ చేస్తే.. అసలేంటీ దరిద్రం? అని అనిపిస్తుంటుంది’’ అని వినాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిరంజీవి గురించి వివి వినాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని విమర్శించేవారికి ఆయన గట్టిగా హెచ్చరించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.