
మే 4 నుండి 10, 2025 వరకు వారఫలాలను తెలుసుకుందాం. ఈ వారం వివిధ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త కార్యక్రమాలు, ఆరోగ్యం, కుటుంబంపై ప్రభావం గురించి తెలియజేస్తాం.
Key Points
వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.
మేష రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడవచ్చు.
మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహ రాశి వారికి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది.
మేషం నుండి కర్కాటకం వరకు రాశిఫలాలు
రాశి ఫలాలు (వారఫలాలు) 04.05.2025 నుంచి 10.05.2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: వైశాఖ మాసం, తిథి : శు. సప్తమి నుంచి శు. త్రయోదశి వరకు
మేష రాశి వారు కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్ట మేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యల నెదు ర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు.
వృషభ రాశి వారికి నూతన వస్తు వస్త్ర వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది.
సింహం నుండి మీనం వరకు రాశిఫలాలు
మిథున రాశి వారికి వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. బుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభ కార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావు ఇవ్వకండి.
మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. నూతన వ్యక్తులను నమ్మి మోసపో రాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్పడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు.
సింహ రాశి వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. బుణయతాలు సులభంగా ఫలిస్తాయి.
కన్య రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరిక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. ప్రయత్నం మేరకు స్వల్బలాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. బుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.
తుల రాశి వారికి రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్శొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలధిగమించుటకు బెషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందర పాటు పనికి రాదు. ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి.
ఈ వారం ప్రత్యేక సూచనలు
రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధ మేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృ బాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు.
ధనుస్సు రాశి వారికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. బుణప్రయత్స్నాలు చేస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుదురు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్రీలమూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. బుణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది.
మకర రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది. తోటివారితో విరోధ మేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణా లెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆకస్మిక ధన లాభముంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
కుంభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడు తుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా నుండుట అవసరం. బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును.
మీన రాశి వారికి అకాల భోజనాదుల వల్ల అనారోగ్య మేర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త వనులు ప్రారంభించరాదు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు.
ఈ వారం అన్ని రాశుల వారికి మంచి చెడులు కలిగి ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించి, శుభకార్యాలను సులభంగా నెరవేర్చుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


