|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Weight gain reasons : మధ్యాహ్నం వేళ మీకు ఈ 6 అలవాట్లు ఉంటే.. తెలియకుండానే బరువు పెరిగిపోతారు!

Published: 18-06-2026, 10:37 PM
Weight gain reasons : మధ్యాహ్నం వేళ మీకు ఈ 6 అలవాట్లు ఉంటే.. తెలియకుండానే బరువు పెరిగిపోతారు!

బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు చాలా మంది ఎక్కువగా ఉదయం, రాత్రి పూట తీసుకునే ఆహారం, వ్యాయామాలపైనే ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలవాట్లతో రోజును ప్రారంభించడం ఎంత ముఖ్యమో, రాత్రి వేళల్లో మంచి నిద్రను పొందడం వల్ల జీవక్రియలు మెరుగుపడి బరువు తగ్గడానికి అంతే తోడ్పడుతుంది. అయితే, ఈ ప్రక్రియలో చాలా మంది మధ్యాహ్నం, సాయంత్రం మధ్య సమయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి బరువు నియంత్రణలో మధ్యాహ్న సమయం కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది!

రోజులో ఈ సమయంలోనే ఎక్కువ మంది తీవ్రమైన అలసటకు గురవుతుంటారు. ఆఫీసుల్లో లేదా ఇళ్లలో ఉండే వారికి ఈ టైమ్‌లోనే ఏవైనా స్నాక్స్ తినాలనే కోరికలు బలంగా కలుగుతాయి. దీనివల్ల తెలియకుండానే జంక్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతారు. మధ్యాహ్నం వేళల్లో మనం చేసే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు శరీర జీవక్రియ వేగాన్ని మందగించేలా చేస్తాయి. అంతేకాకుండా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి, అవసరానికి మించి క్యాలరీలు శరీరంలో చేరడానికి కారణమై ఊబకాయానికి దారితీస్తాయి.

1. భోజనాన్ని స్కిప్ చేయడం

మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల అనుకోని నష్టం జరుగుతుంది. కొందరు క్యాలరీలను తగ్గించుకోవచ్చనే భ్రమతో మధ్యాహ్నం లంచ్ చేయడం మానేస్తారు. దీనివల్ల సాయంత్రానికి ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా రాత్రి పూట అతిగా తినేయడం లేదా సాయంత్రం పూట కంటికి కనిపించిన అన్‌హెల్తీ ఫుడ్స్ తినడం చేస్తారు.

2. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం

మధ్యాహ్నం పూట వచ్చే నీరసాన్ని తట్టుకోవడానికి చాలా మంది ఆఫీసు బ్రేక్ రూమ్స్‌ వైపో లేదా వెండింగ్ మిషన్ల వైపో అడుగులు వేస్తారు. చిప్స్, కుకీలు, బిస్కెట్లు లేదా చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గే ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి. వీటికి బదులుగా శరీరానికి మేలు చేసే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి.

టీవీ చూస్తూనో లేదా ల్యాప్‌టాప్ ముందు ఆఫీస్ వర్క్ చేస్తూనో భోజనం లేదా స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. ఇలా పరధ్యానంగా తినడం వల్ల మనం ఎంత పరిమాణంలో తింటున్నామో తెలియక, అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలను శరీరంలోకి పంపేస్తాం. ఎప్పుడైనా సరే తినే ఆహారంపైనే దృష్టి పెట్టాలి.

మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఒకేచోట ఉండిపోవడం వల్ల శరీరం బద్ధకిస్తుంది. అలా కాకుండా మధ్యలో చిన్న విరామం తీసుకుని కాసేపు చురుగ్గా నడవడం వల్ల శరీర మెటబాలిజం చురుగ్గా ఉంటుంది.

5. లిక్విడ్ క్యాలరీల ముప్పు

మధ్యాహ్నం వచ్చే కాస్త నిద్రను వదిలించుకోవడానికి చాలా మంది టీ, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ లేదా సోడాలు తాగుతుంటారు. అయితే తాము తాగే ఈ పానీయాల ద్వారా శరీరంలోకి ఎన్ని క్యాలరీలు వెళ్తున్నాయనే విషయాన్ని గమనించరు. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండి, పోషకాలు అసలు ఉండవు.

లంచ్ ముగిసిన తర్వాత ఆఫీసుల్లో గంటల తరబడి కదలకుండా సీట్లలోనే కూర్చుండిపోతారు. ఇలా సుదీర్ఘ సమయం పాటు కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే ఎంజైమ్‌ల పనితీరు పూర్తిగా మందగిస్తుంది. అలాగే ఆఫీసుల్లో లిఫ్ట్‌లను వాడటం వల్ల నడక తగ్గుతుంది. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న అలవాట్లను దూరం చేసుకోవడం వల్ల ప్రతిరోజూ సులభంగా కరిగిపోయే వందలాది క్యాలరీలను మనం నష్టపోతాం.

మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట ఆకలి వేస్తే ఏం తినాలో ముందే ఒక ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. ఆఫీసుకు వెళ్లేటప్పుడే వెంట పండ్లు, కూరగాయల ముక్కలు లేదా నట్స్ (బాదం, వాల్‌నట్స్ వంటివి) తీసుకెళ్లడం మంచిది. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందించడమే కాకుండా రాత్రి పూట అతిగా తినకుండా నియంత్రిస్తాయి.

మధ్యాహ్న సమయాల్లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల ఆకలిని సులభంగా నియంత్రించవచ్చు. చాలా సార్లు శరీరానికి దాహం వేసినప్పుడు, మెదడు దాన్ని ఆకలిగా పొరబడుతుంది. ఫలితంగా మనం అవసరం లేకపోయినా ఏదో ఒకటి తినేస్తుంటాం. అందుకే మధ్యమధ్యలో నీరు తాగుతుండాలి.

మధ్యాహ్న సమయంలో ఒకేచోట కూర్చోకుండా కాసేపు చిన్నగా నడవడం లేదా చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌తో పాటు మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తుంది.

మధ్యాహ్న భోజనానికి, రాత్రి డిన్నర్‌కు మధ్య ఉండే సమయమే చాలా మంది బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది. ఆఫీసుల్లో లేదా ఇళ్లలో ఈ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లే శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నాయి. కాబట్టి, ఈ మధ్యాహ్న అలవాట్ల ప్రాధాన్యతను గుర్తించి, తప్పులను సరిదిద్దుకుంటే ఆరోగ్యకరమైన బద్ధతిలో సులభంగా బరువు తగ్గవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.