|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాట్సాప్ స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఒక్క సెట్టింగ్‌తో వాటికి శాశ్వత పరిష్కారం!

Published: 24-05-2026, 6:01 AM
వాట్సాప్ స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఒక్క సెట్టింగ్‌తో వాటికి శాశ్వత పరిష్కారం!
  • వాట్సాప్‌లో అంతర్జాతీయ అన్ నౌన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.
  • ‘సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్’ సెట్టింగ్ ద్వారా అనవసర కాల్స్‌ను ఆటోమేటిక్‌గా సైలెంట్ చేయవచ్చు.
  • ఈ ఫీచర్ కాల్‌ను పూర్తిగా బ్లాక్ చేయదు, కేవలం రింగ్ అవ్వకుండా చేస్తుంది.
  • ముఖ్యమైన కాల్స్ మిస్ అవ్వకుండా, కాల్ హిస్టరీలో చూసుకుని తిరిగి కాల్ చేసే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం వాట్సాప్‌లో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ మోసగాళ్లు అన్ నౌన్ నంబర్ల నుంచి కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్యకు వాట్సాప్ ఒక అద్భుతమైన పరిష్కారం చూపింది. ఒకే ఒక్క సెట్టింగ్ ఆన్ చేయడం ద్వారా ఈ అనవసర కాల్స్ నుండి మీరు విముక్తి పొందవచ్చు.

వాట్సాప్‌లో స్పామ్ కాల్స్‌కు పరిష్కారం

Whatsapp Spam Calls ( Image Credit : AI )

Whatsapp Spam Calls : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌లో స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సైబర్ మోసగాళ్లు అంతర్జాతీయ అన్ నౌన్ నంబర్ల నుంచి కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో బ్యాంకు ఉద్యోగులు, డెలివరీ ఏజెంట్లు లేదా కస్టమర్ కేర్ సిబ్బందిగా నటిస్తూ యూజర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.

ఇలాంటి పరిస్థితులలో ఈ స్పెషల్ వాట్సాప్ సెట్టింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ (Whatsapp Spam Calls) నంబర్‌ను బ్లాక్ చేయకుండానే అనవసరమైన కాల్స్ నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చు.

ఈ స్పెషల్ సెట్టింగ్ తెలుసా? : వాట్సాప్‌లో ‘సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్’ అనే ఇంటర్నల్ ఫీచర్ ఉంది. ఆన్ చేశాక మీరు సేవ్ చేయని లేదా గతంలో మాట్లాడని నంబర్ల నుంచి వచ్చే వాయిస్ వీడియో కాల్స్‌ను ఆటోమేటిక్‌గా సైలెంట్ చేస్తుంది.

‘సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్’ ఫీచర్ యాక్టివేషన్

కాల్ పూర్తిగా బ్లాక్ అవుతుందని కాదు. ఆ కాల్ మీ ఫోన్ నోటిఫికేషన్‌లలో వాట్సాప్ కాల్ హిస్టరీలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ, రింగ్ అవ్వదు. తద్వారా పదేపదే వచ్చే అనవసరమైన కాల్స్ నుంచి భారీ రిలీఫ్ లభిస్తుంది.

Read Also : Samsung Galaxy S26 Ultra 5G : గేమింగ్, ఫొటోగ్రఫీకి బెస్ట్ ఫోన్.. శాంసంగ్ అల్ట్రా 5Gపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర జస్ట్ ఎంతంటే?

ఈ సెట్టింగ్‌ ఎలా ఆన్ చేయాలి? : ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. ముందుగా, వాట్సాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత, సెట్టింగ్స్‌కు వెళ్లండి. ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. కాల్స్ సెక్షన్ ట్యాప్ చేయండి.

మీకు సైలెన్స్ అన్ నౌన్ కాలర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే మీరు ఆప్షన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్ ఆప్షన్ రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ మెనూలో ఉంటుంది. అదే ఐఫోన్‌లలో అయితే ఈ ఆప్షన్ కింది భాగంలో ఉంటుంది.

ఈ సెట్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి? : ఈ సెట్టింగ్‌లో స్పెషాలిటీ ఏమిటంటే.. ఏ నంబర్‌ను పూర్తిగా బ్లాక్ చేయదు. ఒకవేళ ముఖ్యమైన వ్యక్తి కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే ఆ తర్వాత మిస్డ్ కాల్‌ను చూసుకుని తిరిగి కాల్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వొచ్చు. మీరు ఇంపార్టెంట్ కాల్‌ మిస్ అయ్యే అవకాశం తగ్గుతుంది.

గతంలో సేవ్ చేయని నంబర్‌కు మెసేజ్ పంపినా లేదా వాయిస్ కాల్స్ చేసినా వాట్సాప్ అన్‌నౌన్ నంబర్‌గా గుర్తించదు. అందుకే ఆ నంబర్ నుంచి వచ్చే తర్వాతి కాల్స్ సాధారణంగా రింగ్ కావచ్చు. ఈ సమస్య ముఖ్యంగా డెలివరీ ఏజెంట్లు, టెంపరరీ ఆఫీస్ నంబర్లు లేదా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే కాంటాక్ట్‌ల విషయంలో ఇలా జరుగుతుంది.

ఈ ప్రైవసీ ఫీచర్ ఎందుకంటే? : మీరు ఆఫీసు వర్క్, మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా రాత్రిపూట పదేపదే వచ్చే వాట్సాప్ కాల్స్‌తో ఇబ్బంది పడుతుంటే.. ఈ ప్రైవసీ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. స్పామ్ కాల్స్‌ను పూర్తిగా ఆపేయొచ్చు. మీకు ఏయే కాల్స్ రావాలో వద్దో మీరే కంట్రోల్ చేయొచ్చు.

ఈ ‘సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్’ సెట్టింగ్ వాట్సాప్ యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్ల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇది ఒక సురక్షితమైన మార్గం. వెంటనే ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.