
📌 Key Points
- వాట్సాప్‌లో కొత్తగా అన్‌రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్ రాబోతోంది.
- ఈ ఫీచర్ ద్వారా చదవని మెసేజ్‌లను ఒకేసారి చూడవచ్చు.
- ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో యూజర్ల డేటాకు భద్రత ఉంటుంది.
- ఈ ఫీచర్ ఆప్షనల్ మాత్రమే, యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుంది.
వాట్సాప్ యూజర్లకు ఒక శుభవార్త! త్వరలో అన్‌రీడ్ చాట్ సమ్మరీ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా చదవని మెసేజ్‌లను సులువుగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
అన్‌రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్ అంటే ఏమిటి?
Whatsapp New Feature : వాట్సాప్‌లో ఇప్పుడు అన్‌రీడ్ చాట్‌లన్నింటినీ సెకన్లలో చదవొచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్ వస్తోంది. వినియోగదారులకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Whatsapp New Feature : వాట్సాప్ యూజర్లకు బిగ్ న్యూస్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు వాట్సాప్ లో చదవని మెసేజ్ లను ఒకేచోట చదివేయొచ్చు. ఈ స్పెషల్ ఫీచర్ ఒకసారి అందుబాటులోకి వస్తే.. మీరు చదవని మెసేజ్ సమ్మరీని ఈజీగా చూడొచ్చు.
ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఇతర మెసేజ్ లన్నీ చదివే పరిస్థితి ఉండదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త అన్ రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సెకన్లలోనే అన్ని చదవని చాట్స్ ఈజీగా చూసేయొచ్చు.. ఈ సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అన్ రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్ ఏంటి? : రాబోయే ఈ కొత్త ఫీచర్ యూజర్లు చదవని అనేక చాట్‌ల సమ్మరీని ఒకేసారి చూసేందుకు వీలుంటుంది. ప్రతి చాట్‌ను ఓపెన్ చేసి లాంగ్ చాట్స్ చదవాల్సిన అవసరం ఉండదు. అనేక గ్రూపులలో ఉంటూ ప్రతి మెసేజ్ చదవలేని వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
Read Also : Hyundai Venue : హ్యుందాయ్ లవర్స్‌కు బిగ్ షాక్.. ఈ వెన్యూ కారుపై ఏకంగా రూ. 20వేలు పెంపు.. ఇంతకీ కొనాలా? వద్దా?
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? : వాట్సాప్ ఈ ఫీచర్ కోసం ప్రైవేట్ ప్రాసెసింగ్ అనే స్పెషల్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. యూజర్లు చాట్ సమ్మరీని రిక్వెస్ట చేస్తే కొత్త, చదవని మెసేజ్ మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఆ తర్వాత ఒక సేఫ్ సిస్టమ్‌లో సమ్మరీ క్రియేట్ అవుతుంది అనమాట.
📝 WhatsApp beta for Android 2.26.12.10: what’s new?
WhatsApp is working on a feature that lets users summarize multiple unread chats, and it will be available in a future update! https://t.co/kifTxzfLZq pic.twitter.com/gQLODBGJ6U
— WABetaInfo (@WABetaInfo) March 28, 2026
యూజర్లకు ఫుల్ కంట్రోలింగ్ ఎలా?
అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రక్రియ సమయంలో వాట్సాప్‌కు గానీ, పేరంట్ కంపెనీ మెటాకు యూజర్ల మెసేజ్‌లు లేదా సమ్మరీలకు యాక్సెస్ ఉండదు. ఈ ఫీచర్ ఇతర ఏఐ టూల్స్ కన్నా మరింత సేఫ్ అని చెప్పొచ్చు.
యూజర్లకు ఫుల్ కంట్రోలింగ్ : ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఫోర్సబుల్ ఫీచర్ కాదు. యూజర్లు ఏ చాట్ సమ్మరీలను చూడాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వొచ్చు. ప్రైవేట్ ప్రాసెసింగ్ డిఫాల్ట్‌గా నిలిచిపోతుంది. ఈ ఫీచర్ అవసరమైతే సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు తమ డేటాపై పూర్తి కంట్రోల్ పొందవచ్చు.
బీటా టెస్టింగ్ : ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లలో టెస్టింగ్ జరుగుతోంది. రెగ్యులర్ యూజర్లకు ఇంకా అందుబాటులో లేదు. టెస్టింగ్ అనంతరం ఎక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు.
యూజర్లకు బెనిఫిట్ ఏంటి? : మెసేజింగ్ యాప్‌లలో యాక్టివిటీస్ పెరిగే కొద్దీ మెసేజ్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఫీచర్ ఇక యూజర్లకు టైమ్ సేవింగ్‌తో పాటు లాంగ్ చాట్‌లను పదేపదే స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు.
వాట్సాప్ తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.


