
📌 Key Points
- చిరంజీవి ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.
- కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
- కృష్ణంరాజు చిరంజీవి మంచి విలన్ అవుతారని అభిప్రాయపడ్డారు.
- మురళీమోహన్ మాత్రం చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందుగానే చెప్పారు.
ఎటవంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆయన కెరీర్ ఆరంభంలో, కృష్ణంరాజు చిరంజీవి విలన్ అవుతాడని భావించగా, మురళీమోహన్ మాత్రం ఇండస్ట్రీకి మొగుడవుతాడని ధీమాగా చెప్పారు. ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం
ఎటవంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. టాలీవుడ్‌లో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సినిమా ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. హీరోగా ఎదగాలని కాలేజీ రోజుల నుంచే తపించిన చిరంజీవి, ఇండస్ట్రీలో అడుగుపెట్టే ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అవకాశాల కోసం తిరుగుతూ అనేక తిరస్కారాలు ఫేస్ చేశాడు. అయిపప్పటికీ.. నిరుత్సాహపడకుండా.. తన ప్రతిభనే నమ్ముకుని ముందుకు సాగారు మెగాస్టార్. చిన్నచిన్న పాత్రతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆతరువాత కాలంలో హీరో అవ్వడం కోసం ఎనర్జీ, డాన్స్ సామర్థ్యంతో మేకర్స్‌ను ఇంప్రెస్ చేశారు.
చిరంజీవి డ్యాన్స్‌లో స్పీడ్, ట్యాలెంట్, స్క్రీన్‌పై చూపిన ఎనర్జీ ఏ హీరో కూడా అప్పట్లో చేయలేకపోయారు. అప్పటికే స్టార్ డమ్ ఉన్న హీరోలలో కూడా చిరంజీవిలో ఉన్నస్పీడ్ కనిపించకపోవడంతో.. మేకర్స్ షాక్ అయ్యారు, ఆశ్చర్చపోయారు. వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటు వెళ్లారు. ‘పునాదిరాళ్లు’ సినిమాతో తొలి అవకాశం అందుకున్న ఆయన, ‘ప్రాణం ఖరీదు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమా విడుదలకు ముందే పలువురు సీనియర్ హీరోలు చిరంజీవిలోని ప్రతిభను గుర్తించారు.
చిరంజీవిపై కృష్ణంరాజు, మురళీమోహన్ చర్చ
కసితో, పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లోనటించి మెప్పించారు. తాయారమ్మ, బంగారయ్య లాంటి సినిమాల్లో చిరంజీవి విలనిజం.. అద్భుతంగా పండింది. ఆయన కళ్లలో కనిపించిన పవన్ ఫుల్ ఎక్స్‌ప్రెషన్, నటన చూసి అప్పటి స్టార్ హీరో కృష్ణంరాజు, మరో ప్రముఖ నటుడు మురళీమోహన్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. చిరంజీవి మంచి విలన్ అవుతాడని కృష్ణం రాజు.. లేదు ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని మురళీ మోహన్ అనుకున్నారట. చివరకు మురళీ మోహన్ అన్న మాటలే నిజం అయ్యాయి.
‘మనవూరి పాండవులు’ సినిమా సమయంలో జరిగిన ఆ చర్చలో, చిరంజీవి నటన చూసిన కృష్ణంరాజు, “ఈ చూపులు చూస్తుంటే నెగటివ్ రోల్స్‌కి బాగా సెట్ అవుతాడు… మంచి విలన్ అవుతాడు చూడు” అని మురళీ మోహన్ తో అన్నారు. దానికి వెంటనే మురళీమోహన్ స్పందిస్తూ, “విలన్ ఏంటి సార్… ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి” అని అన్నారట. మురళీమోహన్ చేసిన ఆ మాటలు నిజమయ్యాయి. ఈ విషాయన్ని స్వయంగా మురళీ మోహన్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
నిజమైన మురళీమోహన్ మాటలు
చిరంజీవి పడిన కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి.. చిరంజీవి కెరీర్ అద్భుత మలుపులు తిరిగి, ఆయన టాలీవుడ్ చరిత్రలో ఎవరూ అందుకోలేని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీపై ప్రభావం చూపుతూ, తెలుగు సినీ రంగానికి దిక్సూచిగా నిలిచారు. దాసరి మరణం తరువాత చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా మారారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారంలో ముందుంటు.. నాయకుడిగా పరిశ్రమను నడిపిస్తున్నాడు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎదిగిన చిరంజీవి అందరి కష్టాలు తెలుసుకుని పరిష్కారాలు చూపుతున్నాడు. ప్రభుత్వాలకు, పరిశ్రమకు వారధిలా మారాడు.
మురళీమోహన్ అంచనా నిజమై చిరంజీవి సినీ చరిత్రలో ఎవరూ అందుకోలేని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఆయన పడిన కష్టం, పట్టుదల టాలీవుడ్‌లో చిరంజీవి స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఇది ఎందరికో ఆదర్శం.

