
📌 Key Points
- జోనితా గాంధీ 1989 అక్టోబర్ 23న న్యూఢిల్లీలో జన్మించారు.
- ఆమె కుటుంబం కెనడాలోని బ్రాంప్టన్‌కు వలస వెళ్లింది.
- వెస్ట్రన్ ఒంటారియో విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా పొందారు.
- ఆమె తండ్రి, సోదరుడు సంగీత కళాకారులు.
అడివి శేష్ డెకాయిట్ మూవీలోని ‘టచ్ బడ్డీ’ పాటలో జోనితా గాంధీ తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరు, ఆమె నేపథ్యం ఏంటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు.
జోనితా గాంధీ ఎవరు? నేపథ్యం ఏంటి?
Decoit: గూఢచారి , హిట్ వంటి యాక్షన్ , థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో అడివి శేష్ (Adivi shesh) ఇప్పుడు మరోసారి మరో యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘డెకాయిట్ : ఏక్ ప్రేమ్ కథ’. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి షానీల్ దర్శకత్వం వహించారు. ఇక అడివి శేష్ సరసన ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. షానీల్ డియో తొలిసారి ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రుబారూ, టచ్ బడ్డీ వంటి పాటలను విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇక్కడ “టచ్ బడ్డీ” పాటతో జోనితా గాంధీ అనే అమ్మాయి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీంతో ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అంటూ అభిమానులు తెగ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. మరి ఈ జోనితా గాంధీ ఎవరో ఇప్పుడు చూద్దాం..
టచ్ బడ్డీ సాంగ్‌తో పాపులర్
1989 అక్టోబర్ 23న న్యూఢిల్లీలో జన్మించిన ఈమె.. పంజాబీ కుటుంబానికి చెందినది. తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడే ఈమె కుటుంబం కెనడాలోని బ్రాంప్టన్ కి వలస వెళ్లింది. దీంతో ఈమె అక్కడే పెరిగింది. టర్నర్ ఫెంటన్ సెకండరీ స్కూల్లో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె.. వెస్ట్రన్ ఒంటారియో విశ్వవిద్యాలయంలోని ఐ వి బిజినెస్ స్కూల్లో చదివి.. 2012లో ఆరోగ్య శాస్త్రం , బిజినెస్ లో డిగ్రీ పట్టా అందుకుంది. ఈమె పాశ్చాత్య హిందుస్తానీ శాస్త్రీయ గానంలో అధికారిక శిక్షణ కూడా పొందింది.
విద్యాభ్యాసం, సంగీత నేపథ్యం
జోనితా గాంధీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె తండ్రి అలాగే సోదరుడు ఇద్దరూ కూడా పార్ట్ టైం సంగీత కళాకారులు కావడంతో ఈమె కూడా సంగీత వాతావరణంలోనే పెరిగింది . వారు తరచూ బహిరంగ సామూహిక కార్యక్రమాలలో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. అలా కుటుంబంతో కలిసి పలు పాటలు కూడా పాడింది. 16 సంవత్సరాల వయసులోనే కెనడియన్ ఐడల్ కోసం ఆడిషన్ ఇచ్చిన ఈమె.. ఆడిషన్ రౌండ్ లను మాత్రం దాటలేకపోయింది. ఇకపోతే తనను తాను సింగర్ గా నిరూపించుకోవడానికి యూట్యూబ్ లో పలు పాటలు పాడడం మొదలు పెట్టింది. ఇకపోతే ఒకానొక సమయంలో ఆకాష్ గాంధీతో పాటు ఇతర స్థానిక సంగీత కళాకారులను కూడా తన టీమ్ లో చేర్చుకొని వారితో పాటలు పాడి యూట్యూబ్లో సెన్సేషన్ సింగర్ గా పేరు దక్కించుకుంది. అలా యూట్యూబ్ ఆల్బమ్స్ ద్వారా సెన్సేషన్ అయిన ఈమె చెన్నై ఎక్స్ప్రెస్ టైటిల్ సాంగ్ తో కెరియర్ ను ప్రారంభించి.. తెలుగులో అరబికుతు, మ మ మహేశా వంటి హిట్ పాటలు పాడింది. ఇక ఇప్పుడు డెకాయిట్ సినిమాలో అడవి శేష్ తో కలసి స్టెప్పులేసి తనలోని డాన్సర్ ను కూడా పరిచయం చేసింది జోనిత. ఇందులో అదిరిపోయే స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
జోనితా గాంధీ తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

