|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వినాయకుడుని ‘చింతామణి గణపతి’ అని ఎందుకు అంటారు? ఓహో ఆ పేరు వెనుక ఉన్న కథ ఇదా?

Published: 03-10-2025, 5:45 AM
వినాయకుడుని 'చింతామణి గణపతి' అని ఎందుకు అంటారు? ఓహో ఆ పేరు వెనుక ఉన్న కథ ఇదా?

ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఆదిదేవుడైన వినాయకుడిని పూజిస్తాము. విఘ్నాలకు అధిపతి అయిన గణపతికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో చింతామణి గణపతి అనే పేరుకు ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ పేరు వెనుక ఉన్న పౌరాణిక వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని పూజించడం ఆచారం, విఘ్నాలు తొలగిపోతాయని నమ్ముతారు.

2

వినాయకుడికి 'చింతామణి' అనే పేరు రావడానికి కపిలముని, దుష్టుడు ఘనుడి కథ కారణం.

4

వినాయకుడు ఘనుడిని సంహరించి చింతామణిని తిరిగి తెచ్చి కపిలమునికి అందజేయడంతో ఈ పేరు వచ్చింది.

వినాయకుడికి ‘చింతామణి’ పేరు వెనుక కథ

మొట్టమొదట మనం ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయని, సమస్యలు ఏమి ఉండవని అంతా నమ్ముతారు. ప్రాచీన కాలం నుంచి ఆది దంపతుల కుమారుడైనటు వంటి వినాయకుడిని మొట్టమొదట ఆర్దిస్తూ వున్నారు. వివాహం , గృహప్రవేశం వంటి వాటి నుంచి ఏ వ్రతం చేసుకున్నా వినాయకుడినే మొట్టమొదట కొలుస్తాము. వినాయకుడిని ప్రధాన దైవంగా కొలిచే ఆలయాలు మహిమాన్విత ఆలయాలుగా వెలసి నిలుస్తున్నాయి.

చింతామణి అనే పేరు ఎందుకు వచ్చింది?

పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడికి అనేక పేర్లు వున్నాయి. ఎన్నో ఆలయాలు వున్నాయి. అయితే వినాయకుడుని చింతామణి అని ఎందుకు అంటారు. “చింతామణి” అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కపిలముని ఆశ్రమంలో ఘనుడి దుర్మార్గం

కపిలముని ఆశ్రమానికి ఘనుడు

అభిజిత్‌ అనే మహారాజుకు ఘనుడు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను చాలా దుష్టుడు, ప్రజల్ని ఎంతో బాధ పెట్టేవాడు. ఓ సారి వేటకు వెళ్ళాడు. అలా వెళ్తూ కపిలముని ఆశ్రమానికి చేరుకున్నాడు. కపిలముని అతిథి సత్కారాలు చేసి, భోజనం పెడతానని అంటాడు. “ఈ ముని ఆశ్రమంలో మాకు ఎలాంటి భోజనం లభిస్తుందా?” అని ఆలోచిస్తూ ఆకులు, కందమూలాలు వడ్డిస్తాడా అని అనుకున్నాడు.

కాసేపటికి కుటీరం దగ్గరకు వెండి పాత్రలు, ఆసనాలు, రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయి. కపిలముని ప్రేమతో ఘనుడికి, అతని అనుచరులకు భోజనం పెట్టాడు. “ఎలా ఘనంగా ఈ ఏర్పాట్లు చేశావు?” అని కపిలమునిని అడిగాడు. కపిలముని — “ఇంద్రుని సహాయంతో నాకు చింతామణి వచ్చింది” అని చెప్తాడు. అయితే నాకు “అది కావాలి” అని ఘనుడు అడుగుతాడు.

వినాయకుడు ‘చింతామణి గణపతి’గా మారిన వృత్తాంతం

కానీ ఇవ్వడానికి కపిలముని ఒప్పుకోలేదు. కానీ బలవంతంగా తీసుకు వెళ్ళిపోతాడు. జరిగిన దానికి బాధపడిన కపిలముని విష్ణువు సహాయాన్ని కోరాడు. శ్రీహరి ప్రత్యక్షమై “వినాయకుడిని ప్రార్థించు” అని సూచించాడు. కపిలముని ఘోర తపస్సు చేసి వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నాడు.

వినాయకుడు ఘనుడి శిరస్సుని ఖండించి, చింతామణిని తీసుకొచ్చి కపిలమునికి అందజేశాడు. కపిలముని దానిని గణనాథుని మెడలో వేసి,“ఈ చింతామణి మీ దగ్గర ఉండనివ్వండి. అందరూ ఈరోజు నుంచి మిమ్మల్ని చింతామణి అని పిలుస్తారు అని అంటాడు. ఇలా వినాయకుడికి చింతామణి అనే పేరు వచ్చింది.

ఇలా వినాయకుడు కపిలముని బాధను తొలగించి, చింతామణిని రక్షించాడు. ఆ సంఘటన నుండే గణపతికి చింతామణి అనే పేరు స్థిరపడింది. చింతామణి గణపతిగా ఆయన భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ, విఘ్నాలను తొలగిస్తున్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.