|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివానీనే ఎందుకు? ‘హే భగవాన్’ వెనుక అసలు కథ ఏమిటి? సుహాస్ మ్యాజిక్ రివీల్!

Published: 11-02-2026, 2:05 PM
శివానీనే ఎందుకు? 'హే భగవాన్' వెనుక అసలు కథ ఏమిటి? సుహాస్ మ్యాజిక్ రివీల్!
  • ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ శివానీ నాగారం హీరోయిన్‌గా నటిస్తున్న ‘హే భగవాన్’.
  • సుహాస్, శివానీ నాగారం జంటగా ఇదివరకే హిట్ కొట్టారు.
  • గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.
  • ఫిబ్రవరి 20న ‘హే భగవాన్’ చిత్రం విడుదల కానుంది.

సుహాస్ హీరోగా గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హే భగవాన్’. ఈ చిత్రంలో శివానీ నాగారాన్ని హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారనే విషయమై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. వారిద్దరి కాంబినేషన్ హిట్ అవ్వడంతో మళ్ళీ రిపీట్ చేశారు.

సుహాస్, శివానీల కాంబినేషన్ మళ్ళీ రిపీట్

Hey Bhagavan: ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో మంచి హిట్ అందుకున్న శివానీ నాగారం.. సైలెంట్‌గా బిజీ హీరోయిన్‌గా మారిపోతుంది. తాజాగా ఆమె నటించిన మరో చిత్రం విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ‘లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా’ వంటి చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ (Hey Bhagavan) అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సుహాస్ (Suhas), శివానీ నాగారం (Shivani Nagaram), సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి వంటి వారు నటించిన ఈ చిత్రాన్ని గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర వివరాలను దర్శకుడు గోపీ అచ్చర మీడియాకు తెలిపారు.

దర్శకుడు గోపీ అచ్చర మాటల్లో సినిమా విశేషాలు

ఈ చిత్ర హీరో సుహాస్ నాకు స్కూల్‌లో జూనియర్. ‘కలర్ ఫోటో’ నుంచి సుహాస్‌తో జర్నీ చేస్తూనే ఉన్నాను. ‘రైటర్ పద్మభూషణ్‌’కి కూడా నేను పని చేశాను. కన్నడలో ఎస్. నారాయణ అనే దర్శకుడి వద్ద పని చేశాను. ఈ కథను సుహాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాయడం జరిగింది. స్క్రిప్ట్‌లో సుహాస్ ఇన్‌వాల్వ్ కాలేదు. కానీ సెట్స్ మీద మాత్రం తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకునేవాడు. సుహాస్ బలమే కామెడీ. అందుకే ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాసుకున్నాను. కామెడీతో పాటుగా ఇందులో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ని ఇందులో చాలా కొత్తగా చూపించాం. అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. మన జీవితంలో ‘హే భగవాన్’ అని అనుకునే సందర్భాలెన్నో ఎదురవుతాయి. అలాంటివి ఇందులో చాలా ఉంటాయి. అందుకే టైటిల్ ఇది పెట్టాం.

ఫిబ్రవరి 20న విడుదల కానున్న ‘హే భగవాన్’

శివానీ నాగారం ను హీరోయిన్‌గా తీసుకోవడానికి కారణం సుహాస్‌తో ఇంతకు ముందే నటించారు. ‘అంబాజీపేట’తో వారిద్దరూ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆల్రెడీ ఈ పెయిర్ జనాల్లో నోటెడ్ అయ్యారు. అందుకే తెలిసిన జంటతోనే వెళ్దామని, శివానీని తీసుకున్నాం. అలా ఆమె ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీలు ఉండవు. స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అంతా హాయిగా నవ్వుతూనే ఉంటారు. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండి, చివరిలో ఎమోషనల్ ఈ సినిమా టచ్ చేస్తుంది. సుహాస్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లా కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా ఇందులోని అతని పాత్ర ఉంటుంది. సుహాస్ ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాడు. 36 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది’’ అని చెప్పుకొచ్చారు.

హే భగవాన్ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా ఉండటమే కాకుండా ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు. సుహాస్, శివానీల జోడి మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.